ఏపీ అధికార పార్టీ వైసీపీకి అత్యంత కీల‌క‌మైన క‌మ్మ సామాజిక వ‌ర్గం దూరమా?  ద‌గ్గ‌రా?  అంటే.. చెప్ప‌డం క‌ష్ట‌మే.. అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు క‌మ్మ వ‌ర్గం బాగానే చేరువ అయ్యా ర‌ని .. త‌ర్వాత‌..అమ‌రావ‌తి రాజ‌ధాని.. చంద్ర‌బాబు ఆయ‌న పార్టీపై తీసుకుంటున్న చ‌ర్య‌లు. ముఖ్యంగా టీడీపీ ఆఫీస్‌పై దాడి.. వంటి ఘ‌ట‌నల త‌ర్వాత‌.. కొంత వ‌ర‌కు ఈ ప‌రిస్థితి త‌గ్గుముఖం ప‌ట్టింద‌నే వాద‌న వినిపిస్తోం ది. అదేస‌మ‌య‌లో క‌మ్మ వ‌ర్గంపై ప్ర‌త్యేకంగా.. జ‌గ‌న్ చూపిస్తున్న శ్ర‌ద్ధ కూడా ఏమీ లేద‌ని అనేవారు ఉన్నారు.

కానీ.. అదేస‌మ‌యంలో పాజిటివ్ కామెంట్లు కూడా ఎక్కువ‌గానే వినిపిస్తున్నాయి. క‌మ్మ వ‌ర్గానికి ప్ర‌త్య‌క్షం గా ఏమీ చేయ‌క‌పోయినా.. జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో వారికి కూడా ప‌రోక్షంగా ల‌బ్ధి చేకూరుతోంద‌ని అంటున్నారు. కొన్ని సార్లు.. ఈ విష‌యం వివాదానికి దారితీసినా.. ప‌రిమిత సంఖ్య‌లోనే క‌మ్మ‌లు.. యాంటీ కోణంలో చూ స్తున్నార‌ని అంటున్నారు. ఎక్కువ‌గా.. పాజిటివ్‌గానే ఉన్నార‌నే భావన ఉంది. పారిశ్రామికంగా.. ఇత‌ర ఇండ‌స్ట్రియ‌ల్ మార్కెట్స్ ప‌రంగా.. క‌మ్మ వ‌ర్గానికి ప్ర‌భుత్వం మేలు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. రాజ‌కీయంగా క‌మ్మ వ‌ర్గం ఆది నుంచి కూడా.. టీడీపీ వైపు మొగ్గు చూపుతుంద‌నే చ‌ర్చ ఉంది. కా నీ, చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌మ్మ వ‌ర్గం.. వైసీపీకి అనుకూలంగా కూడా ఓటు వేసిన సంద‌ర్భం గ‌త ఎన్ని క‌ల స‌మ‌యంలో క‌నిపించింది. ఇక‌, ఇప్పుడు కూడా వైసీపీకి సానుకూలంగానే ఉన్నార‌ని అంటు న్నారు. ప్ర‌ధానంగా.. గ్రామీణ స్థాయిలో క‌మ్మ వ‌ర్గం పాడి వ్యాపారంపైనే ఎక్కువ‌గా ఆధార‌ప‌డింది. ఇప్పుడు జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న అమూల్ పాల సేక‌ర‌ణ‌, మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యాలు.. వంటివి బాగా వ‌ర్క‌వుట్ అవుతున్నాయి.

ఈ ప్ర‌భావంతో. గ్రామీణ స్థాయిలో క‌మ్మ వ‌ర్గం వైసీపీవైపే ఉంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఇక‌, ప‌ట్ట‌ణ‌, న‌గ‌రాల్లో మాత్రం.. టీడీపీ ట్రెండు న‌డుస్తోంద‌ని అంటున్నారు. ఏదేమైనా.. గ‌తంలో కేవ‌లం కులాన్ని చూసుకుని.. రాజ‌కీయాలు చేసిన వారు.. ఇప్పుడు.. త‌మ‌కు అందుతున్న ప్ర‌భుత్వ ఫ‌లాల ఆధారంగా క‌మ్మ వ‌ర్గం.. రాజ‌కీయాలు మారుతున్నాయ‌ని అంటున్నారు.మ‌రి వ‌చ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్ర‌యోజ‌నం చేకూరుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: