ప్రపంచంలోనే అతి పెద్ద దేశాల్లో ఒకటైన రష్యా.. తన పొరుగున ఉన్న ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగింది.. ఆ ఉక్రెయిన్‌  దేశం వైద్య విద్యకు ప్రసిద్ధి చెందింది. అందుకే అక్కడికి మన ఇండియన్లు చాలా మంది వెళ్లి చదువుకుంటుంటారు.. తక్కువ ఖర్చుతో వైద్య విద్య అక్కడ దొరుకుతుంది. మొత్తం మీద వివిధ పనులపై ఉక్రెయిన్‌లో ఉంటున్న 20 వేల మంది ఇండియన్ల భవితవ్యం ఇప్పుడు ప్రమాదంలో పడింది. వీలైనంత త్వరగా వారిని ఇండియాకు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.


ఇదీ అంతర్జాతీయంగా జరుగుతున్న సీన్.. అయితే.. ఇలాంటి ఆపదలను అవకాశాలుగా మలచుకోవడంలో టీడీపీ అధినేత చంద్రబాబు చాలా ముందుంటారు. ఆ యుద్ధం జరిగింది ఎక్కడో ఉక్రెయిన్ లోనైనా.. అక్కడి బాధితులతో చంద్రబాబు జూమ్ మీటింగ్ నిర్వహించారు.. అక్కడి విద్యార్థులతో మాట్లాడారు.. ఏం కాదు.. నేను మీకున్నాను.. మా ఎన్నారై సెల్ మీతో టచ్‌లో ఉంటుంది.. ధైర్యంగా ఉండండి.. రెండు మూడు రోజులు కీలకం.. అంటూ భరోసా ఇచ్చారు. వాస్తవానికి ఇప్పుడు చంద్రబాబు ఓ ప్రతిపక్ష నేత.. విదేశీ వ్యవహారాల్లో ఆయన చేయగలిగింది చాలా తక్కువ. అయినా సరే.. ఆయన చొరవ తీసుకున్నారు. ముందు బాధితుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేసారు. వీలైతే.. వారు ఇచ్చిన సమాచారాన్ని విదేశాంగకు చంద్రబాబు చేరవేయగలుగుతారు. అంతకుమించి చేసే అవకాశం చాలా తక్కువ. అయినా సరే.. చంద్రబాబు తన వంతు ప్రయత్నం చేశారు.


కానీ.. ఇదే అవకాశం ఉన్నా జగన్ ఆ పని చేయలేదు. అలాగని జగన్ ఏమీ చేయలేదా.. అంటే చేశారు.. ఆయన ఈ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. అధికారులతో మాట్లాడి.. ఏం చేయాలో సూచనలు ఇచ్చారు. కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయించారు.. అంటే జరగాల్సిన పని జరిగిపోతోంది.. కానీ.. తేడా ఏంటి..  పబ్లిసిటీ.. అది మాత్రం జగన్ విషయంలో సరిగ్గా జరగడం లేదు. పని చేయడం ఎంత ముఖ్యమో.. ఆ పని చేసినట్టు కనిపించడం కూడా అంతే ముఖ్యం.. మరి ఈ విషయం జగన్ ఎప్పుడు తెలుసుకుంటాడో.. ఏమో..?

మరింత సమాచారం తెలుసుకోండి: