అయితే.. అలా ఉక్రెయిన్ గగన తలంపై నిషేధం విధించేందుకు అమెరికా ముందుకు రావడం లేదు. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు మేం సాయుధ బలగాలను పంపే ఆలోచన లేదని అమెరికా అంటోంది. ఉక్రెయిన్ పై నో ఫ్లై జోన్‌ను విధించడం అంటే ఆ దేశం గగనతలాన్ని నియంత్రణలోకి తీసుకోవడమే అవుతుందని.. అప్పుడు అమెరికా రష్యా విమానాలను పడగొట్టాల్సి వస్తుందని వివరించింది.
ఇదే జరిగితే ఇక అమెరికా నేరుగా రష్యాతో యుద్ధానికి దిగడమే అవుతుంది.. నిజంగా అదే జరిగితే అది ప్రపంచానికి మాత్రం మంచిది కాదని మెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ అంటున్నారు. ఆయన చెబుతున్నది కూడా నిజమే.. అమెరికా నేరుగా రంగంలోకి దిగిందంటే అప్పుడు పరిస్థితి మరింత భయానకంగా తయారవుతుంది. అమెరికా, రష్యా రెండు దిగ్గజాలే.. అందులోనూ రెండు అణ్వాయుధ సంపత్తి కలిగిన దేశాలే.. వీటిలో ఏ ఒక్క దేశం సంయమనం కోల్పోయినా యుద్ధం మరిన్ని దేశాలకు వ్యాపిస్తుంది.
ఒకసారి అమెరికా యుద్ధంలోకి దిగితే.. దాని అనుకూల దేశాలైన నాటో దేశాలు కూడా రంగంలోకి దిగుతాయి. అప్పుడు ఇక వచ్చేది ప్రపంచ యుద్ధమే అవుతుంది. అందుకే పరిస్థితి అంత వరకూ రాకూడదని అమెరికా ఆలోచిస్తోంది. ఆ కారణంతోనే ఉక్రెయిన్ గగన తలంపై నిషేధం విధించే ఆలోచన చేయడం లేదు. మరోవైపు రష్యా యుద్ధ వ్యూహాన్ని మార్చుకుందన్న అనుమానాలు వస్తున్నాయి. రష్యా కొత్త వ్యూహం కారణంగా భారీ ఎత్తున ప్రాణ, ఆస్తినష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందని బ్రిటన్ అంచనా వేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి