పోలవరం ప్రధానంగా వచ్చే ఎన్నికల్లోనూ ప్రచార అస్త్రంగా మారుతుంది. ఎందుకంటే... ఇప్పటికే 2018లో పూర్తి చేస్తామని చెప్పిన.. టీడీపీ.. తర్వాత.. 2019లో చేస్తామని చెప్పింది. అయినా.. కూడా ఇంకా ఏమీ చేయ లేదు. ఇక, ప్రస్తుత ప్రభుత్వం కూడా.. ఇప్పటికే పూర్తి చేస్తామని చెప్పింది. 2021, 2022 అంటూ.. వాయిదా వేసింది. ఇక, తాజాగా వచ్చే ఖరీఫ్ అంటే.. 2023 నాటికి చేస్తామని చెబుతోంది. కానీ, ఇది కూడా సాధ్యమ య్యే లా కనిపించడం లేదని అంటున్నారు.
సో.. వచ్చే ఎన్నికల వరకు కూడా ఇదే.. అంశంపై అధికార ప్రతిపక్షా లు ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు.. మూడు రాజధానులు. అదేసమయంలో అమరావతి. ప్రతిపక్షం అమరావతిని ప్రజల్లోకి తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే.. దీనిపై ఇప్పటికే అనేక రూపాల్లో ఆందోళనలు చేస్తున్న టీడీపీ దీనిని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి.. ఎన్నికల్లో లబ్ధి పొందాలనే వ్యూహంతో ఉంది.
ఇక, మూడు రాజధానులు కూడా వచ్చే ఎన్నికల వరకు కూడా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీంతో దీనిని కూడా అధికార పక్షం నినాదంగా చేసుకుంటుంది. ఇక, ఇద్దరికీ కామన్ అజెండా ఉండే.. ప్రత్యేక హోదా అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఎన్నికల్లో నినాదంగా మారే అవకాశం ఉంది. మొత్తానికి ఈ మూడు అంశాలు.. వచ్చే ఎన్నికల్లో మరోసారి చర్చకు రావడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి