మరి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎవరు టీడీపీకి అనుకూలంగా ఉంటారు? ఎవరు వైసీపీకి మద్దతుగా నిలుస్తారనే చర్చ జరుగు తోంది. ఈ విషయానికి వస్తే.. మోహన్‌బాబు కుటుంబం ఈ దఫా తటస్థంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. సినిమా టికెట్ల విషయంలో కనీసం తమను సంప్రదించలేదని.. ఈ కుటుంబం ఇప్పటికీ గుస్సాగానే ఉంది. అదేవిధంగా చంద్రబాబు హయాంలో ఏ సమస్యలపై అయితే..తాము పోరాటాలు చేశామో.. ఇప్పటికీ.. ఆ సమస్యలు.. తీరలేదని.. మోహన్‌బాబు కుటుంబా వాపోతోంది.
ఈ నేపథ్యంలో కీలకమైన మోహన్‌బాబు.. ఇప్పుడు తటస్థ వైఖరి తీసుకునే అవకాశం ఉంది. లేకపోతే.. బీజేపీ కనుక ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్ ఇస్తే.. ఆ పార్టీకైనా ఆయన ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇటీవల ఆయన బీజేపీకి అనుకూలంగా మాట్లాడారు. ఇక, చిరు వర్గం మరోసారి సైలెంట్ పాత్రే పోషించనుంది. తమ్ముడు రాజకీయాల్లో ఉన్నా.. గత ఎన్నికల్లో నూ ఈ కుటుంబం బయటకు రాలేదు. చరణ్.. ప్రచారం చేస్తానని.. అప్పట్లో చెప్పినా.. ఆయనకు పవన్ సిగ్నల్ ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు.
ఇక, మురళీ మోహన్, అశ్వనీదత్ వంటివారు .. టీడీపీ మద్దతు ఇచ్చినప్పటికీ.. ప్రత్యక్షంగా అయితే..వారు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీఇలా ఉంటే.. సినీ ఇండస్ట్రీ.. మొత్తం.. తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినట్టు నడుచుకుంటుందనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం. మరి ఏం చేస్తారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి