``ప‌వ‌న్ సార్ అంటే మా ఇంట్లో అంద‌రికీ అభిమానం. ఆయ‌న పార్టీ పెట్టారని.. మా ఓట్లు ఆయ‌నకే వేశాం. కానీ,ఆయ‌న ఓడిపో యారు. అయితే... అధికార పార్టీ వాళ్లు మాపై చిన్న‌చూపు చూస్తున్నారు. ఇన్నాళ్ల‌యింది.. క‌నీసం ఇప్ప‌టి వ‌ర‌కు మా వైపు ఆయ‌న తొంగి కూడా చూడ‌లేదు`` - ఇదీ.. గ‌త ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ గోదావరి జిల్లా భీమ‌వ‌రంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌కు ఓట్లేసిన ఓ కుటుంబం వ్య‌ధ‌. ఇక్క‌డ ఒక్క‌చోటేకాదు.. చాలా చోట్ల ఇలానే వాద‌న వినిపిస్తోంది. విశాఖ లోని గాజువాక‌లోనూ ఇదే మాట కొన్నాళ్లుగా వినిపిస్తోంది. మ‌రి దీనికి కార‌ణం ఏంటి ? అంటే.. ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ప్ర‌జ‌ల‌కు ప‌వ‌న్ అందుబాటులో లేక‌పోవ‌డ‌మే.

నిజానికి పార్టీ అధినేత‌గా.. ప‌వ‌న్ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాల్సిన అవ‌స‌రంఉంది. కానీ, ఆయ‌న సినిమాలు షూటింగులు అంటూ హైద‌రాబాద్‌కే ప‌రిమితం అవుతున్నారు. కానీ, అప్పుడప్పుడు మాత్రం వ‌చ్చి మెరుపులు మెరిపిస్తున్నారు. అయితే.. ప్ర‌జ‌ల మ‌ద్య‌కు మాత్రం రావ‌డం లేదు. ఇదే విష‌యాన్ని సామాన్యులు ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రాకుండా.. కేవ‌లం ఎన్నిక‌ల‌కు ముందు వ‌స్తే.. ఎలా అనేది వారి ఆవేద‌న‌. ``మేం ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాం. కానీ, మాకు ఆయ‌న అంద‌నంత ఎత్తులో ఉన్నారు`` అని అభిమానులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

ఇటీవ‌ల జ‌రిగిన ఆవిర్బావ స‌భ‌లో పార్టీ కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టిస్తార‌ని అనుకున్నా.. ప్ర‌క‌టించ‌లేద‌ని.. అభిమానులు వాపోతున్నారు. మ‌రోవైపు.. రాష్ట్రంలో ప్ర‌శ్నించే నాయ‌కుడి కోసం.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గం కూడా ఎదురు చూస్తోంది. నిత్యావ‌స‌ర ధ‌ర‌లు పెరిగిపోవ‌డం .. ప‌న్నులు పెంచ‌డం.. వంటివాటిని ప్ర‌శ్నించే వారి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్‌పై వీరు ఆశ‌లు పెట్టుకున్న మాట వాస్త‌వం.

అయితే.. ఈ రూపంలో ప‌వ‌న్ ఏమీ చేయ‌డం లేద‌ని.. మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గం కూడా వాపోతోంది. మ‌రి ఇప్ప‌టికైనా.. ప‌వ‌న్ నెల‌కొక‌సారైనా.. జిల్లాల‌ను ఎంచుకుని జ‌న‌ఘోష‌ను.. వింటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. లేక‌పోతే.. మ‌ళ్లీ 2019 ఫ‌లిత‌మే ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ప‌వ‌న్ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: