ఏపీ మంత్రివర్గ విస్తరణ సమయంలో ఇలాగే జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రులు అక్కడే వేదికపై ఉన్న సీఎం, గవర్నర్‌లను మర్యాద పూర్వకంగా అభివాదం చేసి.. వేదిక దిగుతారు. అయితే.. ఈ నమస్కారం విషయంలో నిన్న చాలా మంది మంత్రులు అతి చేసినట్టు విమర్శలు వస్తున్నాయి. మంత్రి అంటే.. మంత్రి వర్గ సభ్యుడు.. ముఖ్యమంత్రి అంటే.. మంత్రి వర్గంలో మొదటి వాడు.. మంత్రి వర్గ నాయకుడు.. మరోమాటలో చెపాలంటే.. ముఖ్యమంత్రి కూడా ఒక మంత్రే.. మిగిలిన మంత్రులు ఆయన సహచరులు.
మరి అలాంటి హోదాలో ఉండి కూడా చాలా మంది మంత్రులు జగన్ పట్ల అపరిమితమైన భక్తి ప్రపత్తులు, భయం, గౌరవం చూపించారు. అంత పెద్ద వేదికపై ఆహుతులందరూ చూస్తుండగానే.. వేదికపై మోకాళ్లపై కూర్చుని మరీ ముఖ్యమంత్రి కాళ్లకు నమస్కరించడం చూస్తే.. మరీ అంతగా సాగిలపడాలా.. ముఖ్యమంత్రి మెప్పు కోసం మరీ అంతగా పాకులాడాలా అనిపించక మానదు. కొత్త మంత్రులు అమర్నాథ రెడ్డి, జోగు రమేశ్ ఈ విధంగా ఏకంగా వేదికపైనే మోకాళ్లపై కూర్చుని మరీ జగన్‌కు పాదాభివందనం చేశారు.
ఇక నారాయణ స్వామి వంటి మరికొందరు సీనియర్లు కూడా తమ వయస్సు కూడా మరిచిపోయి జగన్‌కా పాదాభివందనం చేయడం విశేషం.. రోజా, తానేటి వనిత, మేరుగ నాగార్జున, విడదల రజిని.. ఇలా అందరూ జగన్ కాళ్లపై పడిపోయిన వారే. అమర్‌నాథ్ ప్రారంభించిన ఈ పాదాభివందనాల ప్రక్రియను తర్వాత వచ్చిన వారిలో చాలా మంది కొనసాగించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి