ఈ విషయంపై నిగ్గు తేల్చేందుకు కేంద్రం కేసిఆర్ ను కస్టడీ లోకి తీసుకోవాలన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. కుట్ర ఎవరు చేశారో ఆయన దగ్గర ఉన్న సమాచారం తెలియాల్సిన అవసరం ఉందన్నారు. కేసిఆర్ చెప్పిన దాని పై కేంద్రం విచారణ జరిపించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ ప్రశ్నిస్తుందన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. తెలంగాణలో వరదల వల్ల 11లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిందన్నారు.
వరదల్లో జర్నలిస్ట్ చనిపోవడం బాధాకరమన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. జర్నలిస్ట్ చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోక పోవడం దురదృష్టమన్నారు. కాంగ్రెస్ తరపున ఆ కుటుంబానికి లక్ష రూపాయల సహాయం అందిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. జాతీయ రాజకీయాల మీద పడి కేసిఆర్ జాతీయ విపత్తును వదిలేశారని.. వరదల్లో మునిగిపోతున్న ప్రజలను, రైతులను ఆదుకునే ప్రయత్నం చేయలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.
తప్పనిసరి పరిస్థతుల్లోనే కేసిఆర్ గడప దాటారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం నిర్మాణం, నిర్వహణలో లోపం జరిగిందని.. కేసిఆర్ దోపిడీకి కాళేశ్వరం బలైందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మొత్తానికి భారీ వర్షాలు విదేశీ కుట్ర అన్న కేసీఆర్ కామెంట్లపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. మరి కేంద్రం ఈ విషయాన్ని పట్టించుకుంటుందా.. లేక.. లైట్ గా తీసుకుంటుందా అన్నది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి