ఐ.ఎం.ఎఫ్ వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు ఇప్పించడానికి ముందుకు వచ్చింది అమెరికా. వీళ్ళు ఇవ్వడానికి ముందుకు వచ్చాక వీళ్ళు తీర్చలేరు అన్నటువంటి కారణంతో ఆపుకుంటూ వచ్చారు. ఐ.ఎం.ఎఫ్ అయితే బోలెడు షరతులు పెడుతుంది. మీరు అణు బాంబులను తయారు చేయకూడదు. చైనాకి డబ్బులు ఇవ్వకూడదు, చైనాతో అణు ఒప్పందం రద్దు చేసుకోవాలి. ఇలాంటివన్నీ పెడుతుంది. దీంతో ఆగ్రహించిన పాకిస్తాన్ ఐ.ఎం.ఎఫ్ కు మేము బానిసలము కాదు. సాయం అడగట్లేదు మేము అప్పు అడుగుతున్నాం అంటూ ఆగ్రహంతో రగిలిపోయింది.
వాస్తవంగా చెప్పాలంటే పాకిస్తాన్ లో ఆస్థిర పరిస్థితి ఉంది. పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్థిక మంత్రి అమెరికాలోని ఐ.ఎం.ఎఫ్ మీటింగ్ కి అటెండ్ అవ్వాల్సి ఉంది. కానీ క్యాన్సిల్ చేసుకున్నాడు. అలా వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమైనా పరిణామాలు జరుగుతాయా అని. ఎమర్జెన్సీ పెడతారు అన్నటువంటి సందేహం వినపడుతుంది. ఎందుకంటే అక్కడ సుప్రీంకోర్టు రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించమని చెబుతుంది. రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించడం కుదరదని చెబుతుంది పాకిస్తాన్ ప్రభుత్వం. ఎన్నికలు నిర్వహించకపోతే కుదరదు అంటుంది కోర్టు.
ఇకపోతే ఆ ప్రాంతంలోనే స్పెషల్ స్ట్రైక్స్ చేస్తుంది వీళ్ళకు సంబంధించినటువంటి బృందం. ఇకపోతే ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ లో ఎటాక్స్ చేస్తుంది ఆ బృందం. ఇట్లాంటి దశలో కీలకమైనటువంటి పరిణామం లా ఐ.ఎం.ఎఫ్ సమావేశానికి కూడా వెళ్లొద్దని షాభా షరీఫ్ ఈ ఆర్థిక మంత్రికి చెప్పాడు. దీన్ని డైవర్ట్ చేస్తూ ఈయన ఏం చెప్తున్నాడంటే ఐ.ఎం.ఎఫ్ దగ్గర చేతులు కట్టుకుని కూర్చోవడానికి మేము బెగ్గర్స్ కాదని అంటున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి