ప్రపంచానికి రోగాల్ని రుద్దే దేశం చైనా అని చెప్పడంలో ఎవరికీ సందేహం లేదు. గతంలో బర్డ్ ఫ్లూ అనేది కోళ్లకు వస్తుండేది. దీంతో కోళ్లు తినడం మానేయడమో, లేక వాటిని చంపేయడమో చేసి ఆ వ్యాధి రాకుండా కాపాడుకునే వారు. కానీ ప్రస్తుతం చైనాలోని వాంగ్ డాంగ్ ప్రాంతంలో  56 ఏళ్ల ఒక మహిళా  రెస్పారేటరీ ప్రాబ్లంతో మరణించింది. 15 రోజుల పాటు ఆసుపత్రిలో ఉంది. హెచ్3 ఎన్ 8 ఇన్ ఫ్లూ యోంజ వైరస్ తో రెస్పారెటరీ ప్రాబ్లం వల్ల చనిపోయినట్లు చైనా ప్రకటించింది. ఇది మార్కెట్ కు వెళ్లిన సమయంలో ఆ మహిళకు సోకిందని చెప్పింది.  చైనా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు చెప్పింది.


అయితే ఇది మనుషుల నుంచి మనుషులకు సోకదని కేవలం కోళ్ల ద్వారానే ఆ మహిళకు సోకిందని వివరాలు డబ్ల్యూహెచ్ వోకు తెలిపింది. ఇప్పటికే 200 మిలియన్ల కోళ్లను ప్రపంచ వ్యాప్తంగా చంపేశారని తెలుస్తోంది. ఒక్క జపాన్ లో 15 మిలియన్ల కోళ్లను చంపేసినట్లు తెలుస్తోంది.


అయితే ఇది మనుషులకు సోకడం అనేది తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నారు. బర్డ్ ప్లూ తో మనిషి చనిపోవడం మొదటి సారి కావడం కూడా చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే వుహన్ ల్యాబ్ లో కరోనా వైరస్ లీకై ప్రపంచం మొత్తం కొన్ని లక్షల మంది మరణాలకు కారణమయ్యారని చైనాపై నిందలు ఉన్నాయి. ఇప్పటికీ ఆ ల్యాబ్ లోకి ఎవరినీ రానీయడం లేదు. ఎందుకంటే ఎక్కడ తమ తప్పులు బయటపడతాయోనని చైనా ఒప్పుకోవడం లేదు.


ఇప్పుడు ఏకంగా బర్డ్ ప్లూతో మనిషి చనిపోవడం అనేది తీవ్రమైన విషయమే. బర్డ్ ప్లూ వచ్చిన కోళ్లను చంపేసే వారు. కానీ మనిషికి రావడం వల్ల ఇప్పుడు ఎలాంటి మందులు వాడాలి. దీనికి ఎటువంటి వైద్యం తీసుకోవాల్సిన అవసరముందనే వివరాలు ఎవరికీ తెలియదు. రాబోయే కాలంలో బర్డ్ ఫ్లూ ఎవరికీ రావొద్దనే కోరుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: