2014లో ఆక్రమించుకున్నటువంటి క్రిమియాను స్వాధీనం చేసుకోవడానికి తన సైన్యాన్ని అంతటినీ కదుపుతుంది ఉక్రెయిన్. ఇప్పటిదాకా డిఫెన్స్ వ్యూహం అంటే రక్షించుకునే వ్యూహాన్ని ఫాలో అయినా, ఇప్పుడు ఆఫెన్స్ వ్యూహాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతుంది. ఆఫెన్స్ వ్యూహం అంటే, ఎదుటి వాళ్ళ ప్రాంతాలను లాక్కునే ప్రయత్నం చేస్తుంది. దాన్ని తిప్పి కొట్టింది రష్యా. వరుస పెట్టి బాంబులు, మిసైల్స్ ను ప్రయోగిస్తుందది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ కి సంబంధించిన కార్సన్ ప్రాంతంలో తన తీవ్రమైన దాడిని పునరుద్ధరించారు. రష్యా నియంత్రణలో ఉన్న క్రెమియా ప్రాంతానికి గేట్వే అయిన కార్సన్లో పుతిన్ తన దాడిని తీవ్రతరం చేశారు. రష్యా తాజా దాడిలో 9 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారని తెలుస్తుంది. రష్యా ఫిరంగిదళం రెండు ఉక్రేనియన్ కోవిడ్జెర్లను కూడా నాశనం చేసింది . డెప్పర్ నది యొక్క కుడి ఒడ్డుపై రష్యా తనకు సంబంధించిన సైనిక దళాలతో వచ్చి దాడి చేసింది.
ఉక్రెయిన్ మీద ప్రతీకారంతో కార్సన్ ప్రాంతంలో డెప్పర్ నది ఎడమ ఒడ్డున 6 కమ్యూనిటీకి చెందిన బాంబులను ఇంకా 42కు పైగా ఫిరంగి సెల్లను కాల్చారు. ఉక్రెయిన్ దేశానికి ఎన్ని దేశాలు యుద్ధంలో కలిసి వచ్చినా రష్యా ముందు, రష్యా దాడుల ముందు వాటి, ఆ దేశాల సహాయం కూడా ఒక రకంగా తేలిపోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ ప్రతిఘటన చేస్తుంది ఉక్రెయిన్ కానీ ఉక్రెయిన్ సైన్యాన్ని చంపడంలో ఇక్కడ సక్సెస్ అవుతుంది మాత్రం రష్యా.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి