ఆ లీకైన పేపర్లకు సంబంధించి పాకిస్థాన్ లో ని షాబాద్ షరీప్ ప్రభుత్వం చైనా తోనే వెళ్లాలనే ఒత్తిడి ఎక్కువ వస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా నిఘా విభాగం చాలా రహస్యంగా చేసిన విచారణలో పాకిస్థాన్ ప్రభుత్వం అమెరికా ను కాదని చైనాతో ఎక్కువ సత్సంబంధాలు పెట్టుకోవాలని చూస్తున్నట్లు తేలింది.
పాక్ విదేశాంగ మంత్రి హినా రబ్బానీ ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ.. అమెరికా, చైనా అనే రెండు దేశాలతో ఒకేసారి కలిసి పని చేయలేమని పేర్కొంది. ఏదో ఒక దేశంతో వెళ్లాలనుకుంటే చైనాతోనే వెళితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అమెరికాతో ఎక్కువ స్నేహం పెంచుకుని కలిసి సాగితే చైనా కు కోపం తెప్పించిన వాళ్లం అవుతాం. దీంతో చైనా అప్పులు తిరిగి వెంటనే కట్టమని అడుగుతుంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అప్పులు తీర్చే పరిస్థితి లేదు. కాబట్టి చైనా తో కలిసి నిర్ణయాలు తీసుకోవడం లో తప్పు లేదని పాకిస్థాన్ భావిస్తోంది. కాబట్టి అమెరికా, చైనాల్లో దేనికి సపోర్టు ఇస్తారని అడిగితే చైనా అని చెప్పే స్థాయికి పాకిస్థాన్ వచ్చేసింది. కానీ గతంలో అమెరికా, పాక్ కు సైనిక పరంగా, ఆయుధాల పరంగా, ఆర్థికంగా ఎన్నో సేవలు అందించింది. దీనికి ప్రతిఫలంగా ఇప్పుడు అమెరికా కంటే మాకు ముఖ్యం చైనా యే పాక్ తన వక్రబుద్ధిని చాటుకుంటోంది. మరి ఇప్పటికైనా అమెరికా పాకిస్థాన్ ను నమ్మడం ఆపేస్తుందా లేదా చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి