తెలుగుదేశం పార్టీతో, జనసేన పార్టీ రాబోయే ఎలక్షన్లలో కలిసి వెళ్లడం ఖాయంగానే కనిపిస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తు గురించి మాత్రమే ఏ విషయం ఇంకా తేలడం లేదు. బిజెపి రాష్ట్ర నాయకత్వం ఈ విషయాన్ని కేంద్రానికి వదిలేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ లోగా తెలుగుదేశం ఇంకా జనసేన పార్టీకి సంబంధించిన అనుకూల సోషల్ మీడియా వింగ్స్ లో అభిమానులు మాత్రం కమ్యూనికేషన్ ని కరెక్ట్ గా కంటిన్యూ చేస్తున్నారు.


రెండు పార్టీ వాళ్లు ఒకే రకమైన పోకడని అనుసరిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే వాళ్ళిద్దరికీ, తెలుగుదేశం పార్టీ ఇంకా జనసేనకి ఉమ్మడి శత్రువు అయిన జగన్ ని గాని, వేరే పార్టీల వాళ్ళని గాని విమర్శించేటప్పుడు ఒకే రకంగా మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి నుంచి ఎలక్షన్లకు  ఒక సంవత్సరం గడువుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరూ దానికోసం ఏం చేయాలనేది ఆలోచించాలి అని అంటున్నారు కొంతమంది.


అంటే కమ్మ సామాజిక వర్గం, ఇంకా కాపు సామాజిక వర్గం తెలుగుదేశం ఇంకా జనసేన పార్టీలు రెండు కలిసి తర్వాత జరగబోయే కార్యాచరణ గురించి ఆలోచించాలి. అసలు తెలుగుదేశం పార్టీకి ఉన్న ఓట్ల లెక్క ఒక కోటి అని తెలుస్తుంది. అలాగే జనసేన ఓట్ల లెక్క 40 లక్షలని ఈ మధ్యన లెక్కల ప్రకారం వస్తున్న అంచనా. అయితే ఇప్పుడు తెలుగుదేశం ఇంకా జనసేన పార్టీలకు సంబంధించిన ఓట్లను కలిపితే కోటి నలభై లక్షలు అవుతుంది.


ఈ ఓట్లన్నీ గంప గుత్తగా పడితే అదనంగా ఇంకో 30 నుండి 40 లక్షల ఓట్లు పడితే సరిపోతుందని అనుకుంటున్నారు. సరిగ్గా వీళ్ళు అనుకున్నట్లుగానే జరిగితే 100 సీట్ల వరకు గెలిచేయొచ్చని వీళ్ళ, జనసేన పార్టీ ఇంకా తెలుగుదేశం పార్టీ వర్గాల అంచనా. ఓవరాల్ గా ఉన్న ఓట్లలో  ఈ 100 సీట్లు కీలకమనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లడం ద్వారా విజయం సాధించ వచ్చని వీళ్ళ అంచనా.

మరింత సమాచారం తెలుసుకోండి: