ఒకప్పుడు తెలంగాణ వాళ్ళని దోచుకున్న ఆంధ్ర వాళ్ళు అంటూ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాది రిచ్ స్టేట్, మీది వెనకబడిన స్టేట్ అంటూ చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ల మాటలు నిజం అనుకుంటే నిజంగా ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని దోచుకుని ఉంటే ఆయన చెప్పినట్టు తెలంగాణ రిచ్ స్టేట్ ఎలా అవుతుంది అని కొంతమంది ఈ వ్యాఖ్యలపై సందేహపడుతున్నారు.
ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు తాజాగా అప్పుల లెక్క అక్కడ ఉన్న పత్రికలు వివరిస్తున్నాయని తెలుస్తుంది. ఇప్పటివరకు కిస్తీలు వడ్డీలకే సరిపోతున్నాయని, 2.41 లక్షల కోట్లు సర్కార్ కట్టింది అంటూ చెప్పుకొస్తున్నాయి ఆ పత్రికలు. అందులో వడ్డీలకే 1,06,990 కోట్లు పోయాయని చెప్పుకొస్తున్నారు. వచ్చే మూడేళ్లలో మరో రెండు లక్షల కోట్లు కట్టాల్సి ఉంటుంది అని చెప్పుకొచ్చారు.
అప్పులు కట్టడానికి మళ్లీ అప్పులు చేస్తున్నారని, భూములు అమ్ముతున్నారంటూ రాసుకొచ్చాయి ఆ పత్రికలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 7000 కోట్లు కట్టారని, ఇప్పుడు 60 వేల కోట్లు కిస్తీతో సహా కట్టాల్సి వస్తుంది అని రాసుకొస్తున్నాయి. ఏది ఏమైనా సరే సంక్షేమ పథకానికి డబ్బులు వేస్తూ ఉండడంతో డబ్బులనేవి ఈ రకంగా ఓ పక్క నుండి ఖర్చు అయిపోతున్నాయని తెలుస్తుంది. అసలు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఏ పార్టీ గెలిచే అవకాశాలు లేవని మొన్న కర్ణాటకలో జరిగిన ఎలక్షన్స్ నిరూపించాయని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి