అయితే జెఫోరియా ప్రాంతంలో అణు విద్యుత్ ప్లాంట్ ఉంది. జెఫోరియా ప్రాంతాన్ని పూర్తిగా రష్యా స్వాధీనం చేసుకుంది. యుద్ధం ప్రారంభమైన రోజుల్లో జెఫోరియా ప్రాంతంలో బాంబు దాడులు జరిగినప్పుడు ప్రపంచ దేశాలు రష్యాకు కొన్ని కీలక సూచనలు చేశాయి. జెఫోరియా అణు బీవిద్యుత్ ప్లాంట్ పైన బాంబులు వేయకూడదని దాని పైన బాంబులు పడితే అణు విధ్వంసంకి దారితీస్తుందని రష్యాను దాడి చేయకుండా ఒప్పించాయి. ఆ సందర్భంలో జెఫోరియాను స్వాధీనం చేసుకున్న సమయంలో ఎలాంటి ఇబ్బంది కలిగకుండా చూసుకుంది.
రష్యా కానీ ప్రస్తుతం జెఫోరియాలోని అణు విద్యుత్ ప్లాంట్ పై సొంత దేశం అయినా దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా అణు విద్యుత్ ప్లాంట్ లో కూలింగ్ సిస్టం దెబ్బతిందని ఆ కూలింగ్ సిస్టం దెబ్బ తినడం వల్ల అణు విస్ఫోటనం ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఒకవేళ పూర్తిగా కూలింగ్ సిస్టం దెబ్బతిని అందులో ఉన్న అణు రియాక్టర్లు పేలిపోతే ఒక అణు బాంబు పడినంతన పని అవుతుందని దీని ద్వారా చుట్టుపక్కల ఉన్న యూరప్ దేశాలకు సైతం దాని రియాక్షన్ ఉంటుందని తెలుపుతున్నారు. కాబట్టి నిపుణుల హెచ్చరిక ప్రకారం ఆ కూలింగ్ సిస్టం ని మెరుగుపరిచి ఉక్రెయిన్ లోని అణు విద్యుత్ ప్లాంట్ పై దాడి చేయకుండా చూడాల్సిన బాధ్యత యూరప్ దేశాల పైన ఉంది. ఎందుకంటే యూరప్ దేశాలు ఇప్పటికే ఆయుధాలు సరఫరా చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆయుధాలు సరఫరా చేసి మరి అణు విధ్వంసం చేయించుకోవడం మూర్ఖత్వంతో కూడిన పని అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి