చంద్రబాబు నాయుడు అంతకు ముందు చావు తప్పి కన్ను లొట్టబోయిన విధంగా గెలుపు సాధించారు. కానీ ఈసారి ఆ విధంగా కాకుండా కచ్చితంగా గెలవడానికి సింపతి అనే పాయింట్‌ను ఆయన వాడబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆ సింపతి తనపై కాకుండా తనను నెగ్గించగలిగే వ్యక్తిపై అప్లై అయ్యేలా ఆయన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈసారి ఎలక్షన్లలో తనను గెలిపించగలిగే మంత్రం కాపు ఓట్లు.
ఈ కాపు ఓట్లను తన వైపు రాబట్టుకోవడానికి పవన్ ని రంగంలోకి దించారు చంద్రబాబు. చంద్రబాబు నాయుడుకి రాజకీయంగా బలం ఉన్నా కూడా ఈసారి తాను నెగ్గాలంటే ఒక ఆకర్షణ ఉండాలి. అది మెండుగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అయితే అలాంటి వ్యక్తిని ఎవరైనా విమర్శిస్తే, జనాల్లో ఆయనపై సింపతి కలిగితే అది తనకు ఓటు బ్యాంకుగా పనిచేస్తుందని అనుకుంటున్నారు చంద్రబాబు.
ఇక్కడ విమర్శించడం అంటే సైధ్ధాంతికంగా విమర్శించడం అయితే పర్వాలేదు. కానీ వ్యక్తిగత విమర్శలకు వస్తే మాత్రం అది జనాల సింపతి ఏర్పడేలా ఉంటుంది. అయితే ఇప్పటివరకు జగన్ పవన్ కళ్యాణ్ ఎన్ని విమర్శలు చేసిన చాలా తక్కువ మోతాదులోనే విమర్శలు చేసే వారు. అయితే అది సరిపోలేదు చంద్రబాబు నాయుడుకి. ఇప్పుడు ఆయన కోరుకున్నట్లుగానే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు జగన్ స్పందించడం చూస్తే ఆయన కల నెరవేరేటట్టే ఉంది. ఇది జగన్ గమనిస్తున్నారో లేదో, చంద్రబాబు నాయుడు చాకచకాన్ని అర్థం చేసుకుంటున్నారో లేదు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి