అయితే ఇప్పటివరకు హైదరాబాద్ ని 9 ఏళ్ళు పరిపాలించింది ఎవరు అని ఆ రాజకీయ విశ్లేషకులు అడుగుతున్నారు. హైదరాబాదులో నాలుగు రోజులు కాదు కదా రెండు రోజులకు ఒకసారి కూడా సరిగ్గా వాటర్ రానటువంటి పరిస్థితి చాలా చోట్ల నెలకొందని వాళ్ళు అంటున్నారు. అసలు ఇంట్లోకి అవసరమైన అంతటి నీటిని పొందలేకపోతున్నారు హైదరాబాద్ నివాసితులు. వాళ్ల అవసరాలకి సరిపడా అంతట నీటిని కూడా వాళ్లు పొందలేకపోతున్నారు.
ఇక్కడి ప్రజలు ఉదయం లేచిన దగ్గర నుండి బట్టలు ఉతుక్కోవడానికి, అంట్లు కడుక్కోవడానికి, ఇల్లు శుభ్రం చేసుకోవడానికి ఇంకా శారీరక శుభ్రతకు ఇలా నీటి అవసరం ఎంతో ఉంటుంది. అయితే వాళ్ల అవసరాలకు తగ్గ నీటిని వాళ్లు పొందుతున్నారా అని ఆయనను అడిగితే ఆయన ఏం సమాధానం చెబుతారు అని ఆ రాజకీయ విశ్లేషకులు అడుగుతున్నారు.
ఇంకో విషయం ఏమిటంటే హైదరాబాదులో ఇంతటి నీటి సమస్యను పెట్టుకొని, అక్కడ ఆ సమస్యను పరిష్కరించడం లేదు. మరి వేరే రాష్ట్రం లోకి వెళ్లి, అది కూడా తాను అధికారంలోకి వస్తే అక్కడి నీటి సమస్యను తీర్చేస్తానని ఏవిధంగా చెబుతున్నారని వాళ్ళు అడుగుతున్నారు. ముందు మన ఇంటిలో ఉన్న సమస్యను పరిష్కరించి చూపమని వాళ్లు అంటున్నారు. అంటే హైదరాబాదులో సమస్యను అధిగమించిన తర్వాత ఆయన అనుకున్న విధంగా చేసుకోమని అంటున్నారు వాళ్ళు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి