ప్రస్తుతం ఉన్న స్థాయి నుండి మరింత పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ సానుకూలతను పెంచుకోవాలని సూచించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నేత అభిషేక్ దత్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఆమ్ ఆద్మీ పార్టీ అసలు మహారాష్ట్రలో అలాగే బీహార్ లో ఏం జరుగుతుందో ఒకసారి చూడాలి అని ఆయన అన్నట్లు తెలుస్తుంది.
ఆప్ అపరిపక్వతతో వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. రాజకీయాల్లో నా దారి రహదారి అన్నట్లుగా వ్యవహరించడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. ప్రతిపక్షాల సమావేశంలో పాల్గొనడానికి ఆ పార్టీకి కూడా అర్హత ఉందని, కానీ దానికి షరతులు విధించడం సరికాదని ఆయన పేర్కొన్నట్లుగా సమాచారం. ఈనెల 17, 18 వ తేదీల్లో బెంగళూరులో జరిగే ప్రతిపక్షాల సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీని కూడా కాంగ్రెస్ ఆహ్వానించినట్లుగా సమాచారం.
కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఈ సందర్భంలో మేము ఏం చెప్తే అది వినాలి అన్నట్లుగా ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ షరతులు పెడుతుందని తెలుస్తుంది. దేశ రాజధాని లో పరిపాలన సేవల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్ ని తీసుకురాబోతుంది. అయితే కేంద్రం చేసే ఈ ఆర్డినెన్స్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలని, మద్దతు ఇస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎదురు చూస్తుందని సమాచారం. ఈ విషయంపై ఆప్ పై కాంగ్రెస్ మండిపడుతుందని తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి