భారతీయ జనతా పార్టీ సోము వీర్రాజుని, అలాగే బండి సంజయ్‌ను వీళ్ళిద్దరిని ఇప్పుడు చిన్న చూపు చూస్తుందని పార్టీ నేతలే అంటున్నారు. భారతీయ జనతా పార్టీకి వీళ్ళు నచ్చలేదో లేదా వీళ్ళపై ఉన్న వ్యతిరేకతనే లెక్కలోకి తీసుకుందో గాని వీళ్ళిద్దరికీ అధిష్టానం ఇవ్వవలసినంత విలువని ఇవ్వడం లేదని అంటున్నారు. వీళ్ళిద్దరూ కూడా పార్టీకి కట్టుబడిన వాళ్ళే. ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన సంఘ్ పరివార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లే అని సమాచారం.


ఉప ఎన్నికల్లో అప్పటివరకు  0.8శాతం ఉన్న ఓటింగ్ శాతాన్ని  14శాతం వరకు తీసుకువచ్చాడు సోము వీర్రాజు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగున్నర శాతం వరకు తీసుకు వచ్చాడు ఆయన. అయితే ఎంత చేసిన ఆయన్ని కూడా భారతీయ జనతా పార్టీ పక్కన పెట్టేసిందని అంటున్నారు. ఇలా వాళ్ళిద్దర్నీ పక్కన పెట్టేసి భారతీయ జనతా పార్టీ కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చిందని సమాచారం. అయితే వీళ్లకు ఇచ్చిన పోస్టులు అంత ప్రధానమైనవి కాదు అని అంటున్నారు.


వారికి నేషనల్ కమిటీలో మెంబర్ షిప్ పోస్టులు ఇచ్చినట్లుగా సమాచారం. ఇది వరకు ఇదే పోస్టులో సోము వీర్రాజు ఏడు సంవత్సరాలు పని చేశారు. బండి సంజయ్ కూడా ఇదే తరహా పోస్ట్ లో పని చేశారని సమాచారం. మొన్నటి వరకు బండి సంజయ్ కి మంత్రి పదవి వస్తుందని  ఆశించారు. కానీ భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. అలాగే భారతీయ జనతా పార్టీ అధిష్టానం కిషన్ రెడ్డిని తీసేసిందీ లేదు.


అలాగని మంత్రివర్గం నుండి రాజీనామా చేయమని చెప్పిందీ లేదు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పురందరేశ్వరిని ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించింది. మరి ఆమె పోస్టులో నైనా సోము వీర్రాజుని నియమించవచ్చు కదా అన్న వాదనలు వస్తున్నాయి. కానీ ఆయనను జాతీయ కార్యవర్గ సభ్యుడుగా మాత్రమే నియమించడం జరిగింది. ఇది ఆల్రెడీ గతంలో ఆయన చేసినటువంటి పోస్టే కదా అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: