నియోజక వర్గాల పరిధిలో బలమైన గ్రిప్ ఉన్న నాయకులు ఇప్పుడు జనసేన పార్టీలోకి వలసలు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటికే కందుల దుర్గేష్, బొలిశెట్టి శ్రీనివాస్, బొలిశెట్టి సత్యనారాయణ, శివ శంకర్, నాగబాబు, పవన్ కళ్యాణ్ లాంటి తమ తమ నియోజక వర్గాల్లో గెలుపు సాధించగల క్యాండిడేట్లు జనసేనకి ఉన్నారు. కిరణ్ నాయుడు, డాక్టర్ బాబు, పంచకర్ల సందీప్ లాంటి బలమైన వ్యక్తులు కూడా జనసేనకి ఉన్నారు.
ఇలా ఇప్పటి వరకు ఒక 15నియోజక వర్గాలకి సరి పోయే విధంగా అభ్యర్థులు ఉన్నారు. ఇప్పుడు తెలుగు దేశం పార్టీలో గతంలో పని చేసిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం టికెట్లు దొరక్క జనసేన లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని విషయం వెళ్లడవుతుంది. వీళ్ళందరూ జనసేన పార్టీకి సంబంధించి మరో 25నియోజక వర్గాల వరకు బలమైన అభ్యర్థులుగా మారబోతున్నారని సమాచారం.
అలాగే వైసిపిలో టిక్కెట్లు దొరక్క కొంతమంది జనసేన వైపుగా వస్తున్నారని తెలుస్తుంది. వీళ్ళతో పాటు ఒకవేళ భారతీయ జనతా పార్టీ గనుక కాంగ్రెస్ వాళ్లని తనవైపు తిప్పుకోకపోతే కాంగ్రెస్ వాళ్ళని కూడా జనసేన వైపుగా తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయట జన సేన శ్రేణులు. ఇంకా చెప్పాలంటే వాళ్ళందరూ తమకు తామే జనసేన పార్టీ లోకి వస్తారని ధీమాగా ఉందట జన సేన. మొత్తానికి అటు తెలుగుదేశం నుండి ఇటు వైఎస్ఆర్సిపి నుండి అలాగే బిజెపి నుండి కూడా జనసేనలోకి వలసలు రాబోతున్నాయని తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి