తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి ప్రజలపై హామీల వర్షాన్ని గుప్పిస్తుంది ఇప్పుడు. అయితే చంద్రబాబు ఇచ్చిన హామీలలో ఒక హామీ మాత్రం ఇప్పుడు ప్రజలను ఆకట్టుకుంటుంది అని అంటున్నారు కొంతమంది రాజకీయ నిపుణులు. అది కూడా ఎంత ఎలా ఆకట్టుకుంటుంది అంటే చంద్రబాబు నాయుడుని నమ్మలేము అని అనుకునే వాళ్ళు కూడా ఈ హామీ విషయంలో సంతృప్తి పడుతున్నారు అని తెలుస్తుంది‌.


తాము అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలను  పెంచము, అలాగే ఇంకా చెప్పాలంటే ఈ కరెంటు చార్జీలను ఇంకా తగ్గిస్తాం అని ఆయన చెప్తున్నారు. గతంలో కూడా చంద్రబాబు హయాంలో పెద్దగా కరెంట్ బిల్లులు పెరిగిన సందర్భం  లేదు. ఒక వేళ పెరిగిన కరెంటు బిల్లులను కూడా ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో బిల్లులోనే అడ్జస్ట్మెంట్ చేయించారు. అలాగే ఇప్పుడు కరెంటు బిల్లులు  యూనిట్లకు బదులుగా  కేవీలలో ఇస్తున్నామని అంటున్నారు‌.


అయితే దీని వల్ల కరెంటు బిల్లులు 2000, 3000 రూపాయలు వచ్చేవి కూడా 5000 నుండి 6000 వరకూ వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఇలా జరిగిందని ఆ శాఖ వాళ్ళని అడిగితే మాకేమీ తెలియదు అని వాళ్ళు వాపోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే తరచుగా పవర్ కట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ. ఈ కరెంటు కోతల విషయంలో  జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని అంటున్నారు కొంతమంది.


అలాగని చంద్రబాబు టైంలో ఈ కరెంటు కోతలు లేవా అంటే అప్పుడు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్నంత కరెంటు కోతలైతే లేవు. ఇప్పుడు సెకండ్ సాటర్డేనో లేదా మరొక సెలవు రోజునో కూడా దాదాపుగా నాలుగు ఐదు గంటలు కరెంటు కోతలతో అసౌకర్యకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. గత సమ్మర్లో కూడా కరెంటు కోతలున్నాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కరెంటు కోతలు అప్పుడు లేవని అంటున్నారు కొంతమంది. కాబట్టి కరెంటు విషయం లో చంద్రబాబునే ప్రజలు నమ్ముతారని సామాజిక వేత్తలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: