అంతరిక్ష రంగంలో ప్రస్తుతం భారతదేశ వాటా కేవలం రెండు శాతం మాత్రమే. చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత భారత అంతరిక్షం వాటా దాదాపు 8 నుంచి 10 వరకు పెరిగే అవకాశం ఉంది. ఒకప్పుడు ఏమీ లేని సమయంలో కూడా అంతరిక్షంలో రాణించాలని భారత్ ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ అమెరికా చైనా లాంటి దేశాలు భారత్ ఈ రంగంలో ఎదగకుండా ఎన్నో అడ్డంకులను సృష్టించాయి.


ఇలా అడ్డంకులు సృష్టించడం వల్ల భారత్ ని అంతరిక్ష రంగంలో ఎదగకుండా ఆపాలి. కానీ మొక్కవోని దీక్షతో భారత్ తను అనుకున్న లక్ష్యానికి చేరుకుంది. చంద్రయాన్ వన్ సక్సెస్ చంద్రయాన్ 2 ఫెయిల్యూర్, చంద్రయాన్ 3 భారీ సక్సెస్ ప్రపంచ దేశాలను భారత్ వైపు చూసేలా చేసింది.


అంతరిక్షంలో శాటిలైట్ లో ప్రయోగం భారత్ అతి తక్కువ ఖర్చుతో చేస్తుంది. అమెరికా రష్యా లాంటి దేశాలు ఉదాహరణకు 10 కోట్ల రూపాయలతో చేసే ఒక ప్రయోగాన్ని ఇండియా కేవలం కోటి రూపాయలతోనే చేస్తుంది. కాబట్టి ప్రపంచంలోని వివిధ దేశాలు శాటిలైట్ లో పంపడానికి ఇండియాను సంప్రదిస్తున్నాయి. ముఖ్యంగా ఖర్చు తక్కువ కావడం సమర్థవంతంగా పనిచేయడం మన శాస్త్రవేత్తలు గొప్పతనంగా చెప్పొచ్చు. గతంలో రాకెట్ ఇంజన్లను ఇవ్వమని రష్యాను కోరితే 30 సంవత్సరాల వరకు ఇవ్వకుండా రష్యాతో అమెరికా రహస్య ఒప్పందం చేయించుకుని అడ్డుకుంది.


ఈరోజు చంద్రయాన్ 3 ల్యాండర్ చంద్రుడే దక్షిణ ధ్రువం పై దిగడం ప్రపంచంలోనే ఒక పైన సంచలనం. ఎంతో అభివృద్ధి చెంది ఎన్నో సౌకర్యాలు ఉన్నటువంటి దేశాలు కూడా సాధించని ఫీట్ ని ఈరోజు ఇండియా సాధించడం అనేది గొప్ప విజయం కింద చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో ఇస్రో మరిన్ని ప్రయోగాలు చేయనుంది. ప్రస్తుతం ఆదిత్య ప్రయోగం ద్వారా సూర్యుడి గురించి తెలుసుకోవడానికి అన్వేషణ ప్రారంభించింది.  ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని భారత ప్రజలు ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: