అయిదేళ్ల దాకా ఒకే రకమైన పాలన ఉంటుంది. ప్రతి ఏడాది ఎన్నికలు ఉండవనే ఉద్దేశంలో జమిలి ఎన్నికల అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ కమిటీ ఏం రిపోర్టు ఇస్తుంది. ఎలా ఇస్తుందనే దానిపై అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే జమిలి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే అది జనవరిలోనే పెట్టాల్సి వస్తుంది. కానీ జనవరిలో రెండు రకాల అద్బుత ఘట్టాలు ఆవిష్కృతం కానున్నాయి.
ఒకటి అయోధ్య రామమందిరం ప్రారంభం. ఇండియాలోని ప్రతి హిందువు కంటున్న కల. అయోధ్యలో రామ మందిర నిర్మాణం.. ఇది పూర్తయితే ఇక నరేంద్ర మోదీ అనుకున్న ప్రధాన లక్ష్యం నెరవేరినట్లు. దీన్ని చూపించి వచ్చే ఎన్నికల్లో కూడా ఓట్లు అడిగవచ్చు. మరో ప్రధానమైన అంశం ఆదిత్య ఎల్ 1 ప్రయోగం చివరి దశలో కక్షలో నిలబెట్టడం ఇది సూర్యుడి గుట్టు విప్పేందుకు భారత్ చేస్తున్న ప్రయోగం.
ఈ రెండు ఘట్టాలు రాబోయే జనవరిలోనే ఉన్నాయి. కాబట్టి ప్రధాని నరేంద్ర మోదీ జమిలికి వెళ్లకపోవచ్చనే అనుకుంటున్నారు. ఒక వేళ జమిలికి వెళితే ఆయన ఈ కార్యక్రమాల్లో ప్రధానిగా పాల్గొనలేకపోవచ్చు. జనవరిలో ముఖ్యమైన ఘట్టం అయోధ్య రామ మందిర ప్రారంభమే. దీని కోసం ప్రజలు ఎంతగానో వేచి చూస్తున్నారు. కాబట్టి ఎన్నికలు వచ్చే అవకాశం లేదని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి