ఇందులో దాదాపు 12 వేల కోట్లను కేటాయిస్తున్నట్లు బీఈఈ డైరెక్టర్ జనరల్ అజయ్ చెప్పారు. ఇందులో ఆరువేల కోట్లను కూడా విద్యుత్ పొదుపు చర్యలను అమలు చేసే సూక్ష్మ, చిన్న తరహ పరిశ్రమలకు అందించనున్నట్లు పేర్కొన్నారు. 2023 లో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ చేసిన ప్రతిపాదనల ఆధారంగానే ఈ పథకానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు.
ఇంధన సామర్థ్యంలో పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలో నే ఆంధ్ర ప్రదేశ్అగ్రస్థానంలో నిలిచినట్లు చెప్పారు. దేశంలో తొలి ఇన్వెస్ట్ మెంట్ బజార్ ను విశాఖ పట్నంలోనే నిర్వహించిన ఏపీ ఇంధన సామర్థ్య ప్రాజెక్టుల్లో 430 కోట్ల పెట్టుబడులు సాధించినట్లు తెలిపారు. ఏపీని ఆదర్శంగా తీసుకుని మొత్తం వివిధ రాష్ట్రాల్లో 2500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో కేంద్ర పారిశ్రామిక రంగంలో వడ్డీ రాయితీ పథకానికి బీజం పోసిందన్నారు. అలాగే ఏపీ ఇంధన శాఖ వడ్డీ రాయితీ కల్పించాలని కేంద్రానికి లేఖ రాసిందని సాక్షి తెలిపింది. మొత్తం మీద ఏపీలో ఇంధన శాఖ తీసుకున్నటు వంటి నిర్ణయంతో కేంద్రం కూడా వివిధ రాష్ట్రాలకు ఈ పథకం అమలు చేయనుంది. దీంతో చాలా పరిశ్రమలు వడ్డీ రాయితీ పొందనున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి