చంద్రబాబు నాయుడు నెల రోజులు కాకుండా రెండు నెలలు కూడా జైల్లో ఉండేందుకు సిద్ధంగా ఉన్నారు. బెయిల్ మీద వస్తే మిగతా కేసులు చుట్టుకుంటాయి. అయితే గతంలో చంద్రబాబు మీద కేసు అంటేనే భయపడేవారు. అయితే గవర్నర్ అనుమతి లేకుండా అరెస్టు చేయకూడదనే వాదనలు వినిపించి ఈ కేసులో విజయం సాధిస్తే గవర్నర్ సంతకం పెడితేనే చంద్రబాబును అరెస్టు చేయొచ్చు అనే దాకా తీసుకొస్తే మొత్తం కేసులు ఆగిపోతాయనే నిర్ణయంతో ఈ కేసులో ముందుకు వెళ్లేందుకే బాబు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. బాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా  కూడా చెప్పింది కూడా అదే.


సుప్రీం కోర్టులో దాదాపు 1300 డాక్యుమెంట్లు విచారణ నిర్వహిస్తారు. 17 ఏ యాక్ట్ ప్రకారం.. గవర్నర్ సంతకం లేనిదే అరెస్టు చేయకూడదనేది ఉంది. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో అని వెయిట్ చేస్తున్నారు. అవసరమైతే రాజ్యాంగ ధర్మాసనం దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. విపక్షాల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. కాబట్టి ముఖ్యమంత్రులు ప్రతిపక్ష పార్టీలో ఉంటారు. ప్రతిపక్ష నాయకులు సీఎంలు అవుతారు. కానీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే వాదనలు వినాల్సిన అవసరం ఉంది.


ఎంపీ రఘురామకృష్ణం రాజు విషయంలో ముందు ఆయన్ని కొట్టారా లేదా అనే వివరాలను తెలపాల్సిందిగా కోరారు. దేశ ద్రోహం కేసు గురించి తర్వాత విచారిస్తామని కోర్టు తెలిపింది. టెక్నికల్ పాయింట్ తో ఎంపీ రాజుకు రక్షణ కల్పించారు. కాబట్టి చంద్రబాబును కూడా ఇప్పుడు బెయిల్ పై బయటకు తీసుకువచ్చే విషయంలో భారీ సైకాలజికల్ కాన్సిట్యూషనల్ లాజికల్ పాయింట్లను చంద్రబాబు లాయర్లు పట్టుకున్నారు.


ఈ విషయంలో వారు సక్సెస్ అయితే మళ్లీ ఎప్పుడైనా బాబును అరెస్టు చేయాలనుకున్న గవర్నర్ అనుమతి తప్పనిసరి అవుతుంది. కాబట్టి ఇంకొన్ని రోజులు జైల్లో ఉన్నా పర్లేదు. కానీ మొత్తం కేసుల నుంచి బయటపడాలనేది ఆయన ఉద్దేశం.

మరింత సమాచారం తెలుసుకోండి: