చంద్రబాబు కోసం చంద్రజ్యోతి ఏ స్థాయికైనా దిగజారుతుందని మరో సారి నిరూపితమైంది. పత్రికా విలువలను తుంగలో తొక్కి ఒక వ్యక్తి పూజ చేసే వార్తలు రాయడంలో ఆ పత్రిక అనుసరించే విధానం మరి దారుణంగా తయారైంది. హౌరా నుంచి చెన్నై వెళ్లి రైలు రాజమహేంద్రవరానికి చేరుకునే సమయంలో ఆ రైలులో ఉన్న అన్ని కంపార్టు మెంట్లలోని వ్యక్తులు మాట్లాడిన మాటలను కథనంగా రాసుకొచ్చింది.


చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసి జైల్లో ఉంచిన సిటీ ఇదేనని అలాంటి గొప్ప వ్యక్తిని అరెస్టు చేయడం ఎంత వరకు సబబు అని మాట్లాడుకున్నారు. ఒరిస్సా నుంచి ప్రయాణం చేస్తున్న ఓ వ్యక్తి అయితే ఒరిస్సా, వైజాగ్ లో హుద్ హుద్ తుఫాన్ వచ్చిన సమయంలో చేసిన చంద్రబాబు చేసిన ప్రయత్నాలతోనే అక్కడి ప్రజలు బతికారని ఆయన ప్రజలను కాపాడటంలో ఎంతో కృషి చేశారని అలాంటి వ్యక్తి జైల్లో ఉండటం బాధకరమని కన్నీళ్లు పెట్టుకున్నారట.. అంతే కాకుండా ఆయనను అరెస్టు చేయడం పై రైలు మొత్తం చర్చ నడిచిందట.


ఇలాంటి వ్యక్తిని అరెస్టు చేయడం అన్యాయమని రైలులో ఉన్న మొత్తం మంది వాపోయారని కథనాన్ని ప్రచురించింది. సమాజంలో ప్రతి అంశంపై నలుగురు కలిసి మాట్లాడుకుంటారు. రాష్ట్రంలో దేశంలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. ప్రతి అంశంపై ఎవరో ఒకరు చర్చ ప్రారంభిస్తే దానిపై ఇష్టారీతిన వాద ప్రతివాదనలు కొనసాగుతుంటాయి. కాబట్టి రైల్లో చర్చ జరిగినంత మాత్రాన దాన్ని ప్రచురించాల్సిన అవసరం ఏముంది.


హుద్ హుద్ తుఫాన్ వచ్చినపుడు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి తప్పకుండా తన కర్తవ్యం నిర్వర్తించాల్సిందే. దాన్ని ఎల్లో మీడియా విపరీత ప్రచారం చేయడమెందుకు.. అంతకుముందు తుఫానులు రాలేదా.. అప్పుడున్న ప్రభుత్వాలు ప్రజలను కాపాడలేదా? ఎందుకు ఇంత పబ్లిసిటీ చేయడం.. ఎల్లో మీడియా చేస్తున్న పబ్లిసిటీనే చంద్రబాబుకు మైనస్ అవుతుందని చాలా మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: