చంద్రబాబు ఇంకా రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించలేదు. అవినీతి కేసుల్లో చంద్రబాబు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. దాదాపు 52 రోజుల పాటు రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ముందుగా ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత రెగ్యూలర్ బెయిల్ కూడా లభించింది. అయితే ఆయన ఇంకా రాజకీయ కార్యక్రమాలు ఇంకా ప్రారంభించలేదు.


అటు తనపై పెట్టిన కేసుల విషయంలో నిబంధనలు పాటించలేదని చెబుతూ చంద్రబాబు సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఆ కేసులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రిజర్వ్ అయింది. అదిగో ఇదిగో అంటూ రోజులు గడుస్తున్నాయి. మరోవైపు చంద్రబాబుపై మోపిన కేసుల విషయంలో విచారణపై కూడా క్వాష్ పిటిషన్ ప్రభావం చూపుతోంది.


క్వాష్ పిటిషన్ ఒక్క చంద్రబాబుపైనే కాదు . భారతదేశంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నేతలందరిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో దేశంలో ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడికి లభించిని అద్భుత అవకాశం సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూద్ధా చంద్రబాబుకి వినిపించారు. అదే 17 ఏ. దీని ప్రకారం ముఖ్యమంత్రిగా ఉన్న లేదా ప్రజాప్రతినిధిని అరెస్టు చేయాలంటే ముందస్తుగా గవర్నర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కొత్త వాదనను తెరపైకి తెచ్చి దానిపై వాదోపవాదనలు జరిపి ఆ కారణంగా ఆయనపై ఉన్న కేసులను క్వాష్ చేయమని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు.


మరోవైపు ఫైబర్ నెట్ కుంభకోణంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు మరోసారి విచారణ వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్ పై తీర్పు తర్వాత ఈ అంశాన్ని విచారిస్తామని.. ఆ తీర్పు ప్రాసెస్ లో ఉందని జస్టిస్ అనిరుద్ధబోస్ ధర్మాసనం తెలిపింది. క్వాష్ పిటిషన్ పై తీర్పు ఇంకా రాయలేదు అన్నట్లు తెలుస్తోంది. దీంతో తీర్పును 12కి వాయిదా వేశారు. ఆ లోపు అంటే డిసెంబరు 12లోపు క్వాష్ పిటిషన్ పై తీర్పు వస్తోందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: