గతంలో ఉమ్మడి ఏపీలో బలీయ శక్తిగా ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ఓ కొత్త ప్రయోగం చేయనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగారు. తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ గతంలోనే ప్రకటించారు. అయితే కాంగ్రెస్ పార్టీని ఏపీలో నడిపించే నాయకులు కావాలి. ప్రస్తుతం అలాంటి నేత షర్మిళ కొంతమేర తీర్చే అవకాశం ఉందని చర్చలు జోరుగా సాగుతున్నాయి.
ఎక్కడైతే పోగోట్టుకున్నామో అక్కడే వెతుక్కొనే వెసులుబాటు షర్మిళ రూపంలో కాంగ్రెస్ కు లభించింది. వైఎస్ కుమారుడు జగన్ మోహన్ రెడ్డి సొంతంగా పార్టీ పెట్టి కాంగ్రెస్ ఓటు బ్యాంకును మొత్తం తన వైపునకు తిప్పుకున్నారు. ఇప్పుడు షర్మిళ ద్వారా తిరిగి తమ ఓటు బ్యాంకును రప్పించుకోవాలని హస్తం నేతలు యోచిస్తున్నారు.
అయితే షర్మిళ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత తన సోదరుడు జగన్ ను విమర్శిస్తారా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో తలెత్తుతోంది. తెలంగాణలో ప్రచారం సందర్భంగా ఆయా నియోజకవర్గాలకు వెళ్లి ఎమ్మెల్యేల అన్యాయాలు, అక్రమాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు కూడా అదే స్థాయిలో చేస్తారా అనేది వేచి చూడాలి. మరోవైపు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు రెండు వేర్వేరు పార్టీలో ఉన్న ఘటనలు మనం ప్రస్తుతం చూస్తున్నాం. కాబట్టి రాజకీయం వేరు.. కుటుంబ బంధాలు వేరు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి