దీనికి తోడు మహిళలు, పిల్లలు కట్టెల సేకరణకు నానా అవస్థలు పడాల్సి వచ్చేది. ప్రధాని గా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించాక వీరిపై ప్రత్యేక దృష్టి సారించి ఉజ్వల యోజన పథకం తీసుకువచ్చింది. దీనివల్ల మహిళలు కట్టెల కోసం ప్రమాద కర ప్రాంతాల్లో సంచరించే అవసరం ఉండదు. దీంతో పాటు మహిళల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు.
ఉజ్వల యోజన పథకంలో భాగంగా తొలినాళ్లలో సుమారు 5 కోట్ల మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రారంభించారు. తర్వాత ఈ పథకం విజయవంతం అయింది. ఓ నివేదిక ప్రకారం ఇండియాలో ఎల్పీజీ కవరేజీ 2022లో 104.1శాతానికి పెరిగింది. 2016లో ఇది 62శాతంగా నమోదైంది. ఈ పథకం ద్వారా ప్రజలను ఆరోగ్యవంతమైన జీవన విధానంలోకి తీసుకురావడంలో నరేంద్ర మోదీ విజయవంతం అయ్యారు.
ఇప్పుడిప్పుడే ఆరోగ్య భారత్ గా మారుతున్న తరుణంలో తిరిగి మళ్లీ అనారోగ్యం వైపే మన వాళ్లు మరలుతున్నారు. కర్రీ పాయింట్, ఫాస్ట్ ఫుడ్, బయట టిఫిన్లు, బిర్యానీలు వంటి వాటికి అలవాటు పడి ఇంట్లో వంట వండటం మానేశారు. ఫలితం అనారోగ్య బారిన పడుతున్నారు. ఇంట్లో వంట వండుకొని తిన్నప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఎప్పుడైతే బయటి తిండికి అలవాటు పడ్డారో ఆసుపత్రుల పాలవుతున్నారు. పేదలకు మంచి జరుగుతుంది అని ఆనందపడేలోపు చెడు చుట్టేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి