చంద్రబాబుతో ఇది వరకు పొత్తు పెట్టుకున్న పార్టీల వారికి కచ్చితంగా ఆయన తీరు తెలిసే ఉంటుంది. పొత్తుకు సంబంధించిన విషయాల్లో ఆయన సీట్ల విషయంలో ఏటు తేల్చకపోవడం అనేది పెద్ద సమస్యగా మారింది. పొత్తుల విషయంలో సరైన విధానం అనేది తేల్చుకోవాల్సిన మిగతా పార్టీలు చంద్రబాబును నమ్ముకుని చివరి వరకు వేచి చూస్తూ ఉండడం వల్ల నష్టపోయిన రోజులు ఉన్నాయి. చంద్రబాబును నమ్ముకుని టీడీపీలో ఏళ్ల నుంచి  పోరాటం చేస్తున్న కార్యకర్తలు, నాయకులు తమకే సీటు వస్తుందని నమ్మకంతో ఉంటారు. కానీ ఆ సీటు కాస్త ఇగో వస్తుంది.


అదిగో వస్తుందనే నమ్మకం పెట్టించి చివరకు వారు పార్టీలో బీఫాం ఇవ్వరు. దీంతో వారు రెబెల్ గా పోటీ చేస్తారు. తర్వాత ఆ పోటీ నుంచి ఎలాగో తప్పించుకోలేక ముందుకు వెళతారు. పోటీలో రెబెల్ గా నిలబడతారు. తద్వారా టీడీపీతో పొత్తు పెట్టుకున్న ఇతర నాయకులు, తదితర కార్యకర్తలు ఎటు తోచక ఎవరి కోసం పని చేయాలో తెలియక ఇబ్బందులు పడతారు.


గతంలో కమ్యూనిస్టులు, బీజేపీ తదితర పార్టీల వారికి ఇది తెలిసిన విషయమే. కానీ జరిగిపోయిన విషయాన్ని తెలుసుకుని బాధపడటం కంటే ముందు జరగబోయేది మేలనే విషయాన్ని గ్రహించి ఆ రెండు పార్టీలు ఎటు మాట్లాడటం లేదు.  ప్రస్తుతం జనసేనతో పొత్తు విషయంలో కూడా అదే జరగబోతుందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. జనసేనతో పొత్తు ఉంటుందని టీడీపీ అధినేత చెప్పారు.  


డైరెక్టుగా పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి మరీ కలిశారు. కానీ ఎక్కడా ఏయే సీట్లలో కలిసి పోటీ చేసేది మాత్రం తేల్చలేదు. దీంతో చివరకు వచ్చే సరికి  పార్టీల మధ్య ఏదో గొడవ జరిగి అందులో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. చివరకు అది ఓటమికి దారి తీసే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు పొత్తు విషయాన్ని తొందరగా తేల్చి ఎన్నికలకు వెళితేనే గెలుపు సాధ్యమయ్యేది.

మరింత సమాచారం తెలుసుకోండి: