ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. పోటీ చేయాలని నిర్ణయం కూడా ఏకాభిప్రాయానికి వచ్చింది. మరి సీట్ల కేటాయింపు? వీటి కోసమే చంద్రబాబు దిల్లీ వెళ్లారు. అమిత్ షాను కలిశారు. అయితే ఈ చర్చల్లో సీట్ల కేటాయింపులు ఒక కొలిక్కి రానట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ సీట్ల కేటాయింపు అనేది జరిగితే ఈ పాటికి టీడీపీ అనుకూల మీడియా రెచ్చిపోయేది.


మా చంద్రబాబు దేవుడు.. ఆయన చెప్పినట్లే బీజేపీ నడుచుకుంది. ఇక టీడీపీకి తిరుగులేదు. అని రెచ్చిపోయి రాసేది. చంద్రబాబు ఆశించిన రీతిలో సీట్ల కేటాయింపు జరగలేదు. 15-20 సీట్లు కేటాయించని పక్షంలో బీజేపీ ఓటు బ్యాంకు కూటమికి మళ్లదు. అలానే జనసేన కూడా మెజార్టీ సీట్లు ఆశిస్తోంది. కానీ వీటిని అత్యంత జాగ్రత్తగా ఎల్లో మీడియా బూమరాంగ్‌ చేస్తోంది. ఏపీ ప్రయోజనాల కోసమే అనే కవరింగ్ ఇస్తూ చంద్రబాబుని గొప్ప లీడర్ అంటూ కీర్తిస్తోంది.


అంతేకాక జగన్ ను ఓడించడమే బీజేపీ, జనసేన ధ్యేయంగా ప్రకటించుకున్నాయని.. దానికోసం ఎన్ని సీట్లు ఇచ్చినా ఒప్పుకుంటాయి అనే అర్థం వచ్చేలా టీడీపీ అనుకూల మీడియా రాస్తోంది. ప్రస్తుతం అయితే ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు తాపత్రయ పడుతున్నారు. అసెంబ్లీలో ప్రశ్నించే గొంతుకగా ఉండాలని పవన్ కల్యాణ్ ఆరాటపడుతున్నారు.  


ఇదిలా ఉండగా  బీజేపీ పెద్దలను చంద్రబాబు కలిసినా ఆ ఉత్సాహం రెండు పార్టీల క్యాడర్ లో కనిపించడం లేదు. అమిత్ షా తో భేటీ జరిగి రెండు రోజులు కావొస్తున్నా ఆ మేర జోష్ పార్టీ శ్రేణుల్లో లేదు. బీజేపీ వచ్చిందన్న సంతోషం టీడీపీ, జనసేనలో లేనట్లు కనిపిస్తోంది. ఎందుకుంటే ఇప్పటికే ఇరు పార్టీల మధ్య సీట్ల వివాదం తలెత్తుతోంది. ఇప్పుడు మూడో పార్టీ వస్తే తమకు ఎక్కడ ఎసరు పెడతారో అని ఇరు పార్టీ సీనియర్ నాయకులు భయపడిపోతున్నారు. అందుకే మీడియా ముందుకు వచ్చి ఆయా పార్టీల నాయకులు మాట్లాడలేకపోతున్నారు అని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: