ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులు, భారీ ట్విస్టులు. ఎక్కడ ఎం జరుగుతుందో తెలియని అనుమానాలు. మొత్తానికి అయితే దిల్లీ రాజకీయాలు రాష్ట్రంలో వేడి ని రాజేస్తున్నాయి. చంద్రబాబు బీజేపీ అగ్ర నాయకులతో భేటీ కావడం తో పొత్తు పొడుపు ఖాయమని ఇక సీట్ల సర్దుబాటు మిగిలిందనే వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా జగన్ దిల్లీలో వాలిపోయారు. ప్రధాని తో గంటన్నర పాటు భేటీ అయ్యారు.  ఈ తరుణంలో పవన్ ఎలా ముందుకు సాగుతారు అనేది చర్చనీయాంశంగా మారింది.


అయితే రాజకీయాలు ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ఒకప్పుడు చంద్రబాబు దిల్లీ వెళ్తే జాతీయా మీడియా ఆయన్ను ఫోకస్ చేసేది. నాలుగైదు పార్టీల జాతీయ అధ్యక్షులను కలిసి మాట్లాడేవారు. కానీ ప్రస్తుతం దిల్లీ వెళ్లినా ఎలాంటి ఆర్భాటం లేకండా కనీసం మీడియాతో మాట్లాడకుండా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని వెనుక బీజేపీ పెట్టిన షరతులే కారణం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమిత్ షాతో సమావేశం కూడా అర్ధరాత్రి 11 గంటలు దాటిన తర్వాత జరిగింది. చంద్రబాబు కి అవసరం కాబట్టి ఆయన అంతసేపు ఎదురు చూశారు.


ఇక బీజేపీ విషయానికొస్తే దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపుతున్నా ఏపీలో మాత్రం చాలా వెనుకబడే ఉంది.  టీడీపీతో పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా  ఆ పార్టీకి మాత్రం స్పెషల్ ప్రయారటీ ఇవ్వలేదని తెలుస్తోంది.  ఎందుకంటే ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు దిల్లోలో ఎన్నికల ప్రణాళిక పై చర్చించారు.  ఆ తర్వాత తొమ్మిది నుంచి పది గంటల వరకు ఝార్ఖండ్ పై రివ్యూ, పది నుంచి పద కొండు గంటల వరకు ఛత్తీస్ గఢ్ లో ఏ విధంగా ముందుకు వెళ్దామనే అంశంపై చర్చించినట్లు తెలిసింది.  


ఆ  తర్వాత 12 గంటల వరకు చంద్రబాబుతో సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఓ పదినిమిషాలు తర్వాత వెళ్లిపోయారు. అమిత్ షా ఒక్కరే ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే మరో మూడు, నాలుగు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని పిలిచి మాట్లాడారు. ఆ తర్వాత పురంధేశ్వరి తో మాట్లాడి చర్చోపచర్చలు జరిగిన తర్వాత పొత్తు, సీట్లపై స్పష్టత వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: