ఏపీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిచిన జనసేన, టీడీపీ అందుకు అనుగుణంగా తొలి జాబితాలో ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటించాయి.  మొత్తం 175 స్థానాలకు టీడీపీ, 151 సీట్లలో, 24 సీట్లలో జనసేన పోటీ చేయనుంది. బీజేపీ పొత్తుకు అంగీకరిస్తే టీడీపీ సీట్లు తగ్గే అవకాశం ఉంది. సీట్ల ప్రకటించిన అనంతరం టీడీపీలో అసమ్మతి భగ్గుమంది. ఎక్కడికక్కడ పార్టీపై నిరసన గళం విప్పుతున్నారు.


టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి టికెట్ విషయంలో ఎటూ తేల్చలేదు. అక్కడ జనసేన అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఆయన తన టికెట్ పై ధీమా గానే ఉన్నారు. సీనియర్ నేతలు గంటా శ్రీనివాసరావు ప్రస్తావనే రాలేదు. బండారు సత్యనారాయణకు తొలి జాబితాలో చోటు దక్కలేదు. కళా వెంకట్రావ్ వర్గానికి ఈ జాబితాలో ఆశాభంగమే అయింది. మరోవైపు కళా వెంకటరావును వ్యతిరేకించే కోండ్రు మురళీకి రాజాం టికెట్ ను ఖరారు చేస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.


గజపతినగరంలో మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు కి షాక్ తగిలింది. అదే సందర్భంలో కొండ పల్లి శ్రీనివాస్ కు గజపతి నగరం టికెట్ దక్కింది. దీంతో అప్పలనాయుడి ఆ పార్టీ నియోజవర్గ ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేశారు.  తూర్పు గోదావరి జిల్లాలో కూడా టీడీపీ సీనియర్ నేతలను పక్కన పెట్టారు. రాజానగరం నుంచి బొడ్డు వెంకట రమణ చౌదరి ని తప్పించారు. ముమ్మిడివరం, కొత్తపేట లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంతో అక్కడి జనసేన నేతల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.


ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆళ్లపాటి రాజా, యరపతినేని శ్రీనివాస్ ల పేర్లు ప్రకటించలేదు. కాకపోతే తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీలో ఉన్నారు.  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మాజీ మంత్రి పీతల సుజాత ను పక్కనపెట్టి చింతలపూడి లో కొత్త అభ్యర్థిని ప్రకటించారు. తణుకు లో రాంచంద్రయ్యకు పవన్ మాటచ్చినా అక్కడ టీడీపీ పోటీలో ఉంది. దీంతో పాటు అభ్యర్థులను ప్రకటించిన పలుచోట్ల టీడీపీ, జనసేన క్యాడర్ లో నైరాశ్యం ఉంది. అసంతృప్త నేతలను చంద్రబాబు, పవన్ లు ఎలా బుజ్జగిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: