దేశ వ్యాప్తంగా రాజకీయాలు ఒక విధంగా నడిస్తే.. తమిళనాడులో రాజకీయాలు దీనికి భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా ఎన్నికల వేళ ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. గత ఐదు దశాబ్దాల చరిత్రను మనం గమనిస్తే ఇక్కడ ఏ ఎన్నిక ఏకపక్షంగా ఉండేది. అయితే గత కొన్నేళ్లుగా తమిళనాడులో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఇందుకు కాస్త భిన్నంగా ఉంటున్నాయి. కానీ లోక్ సభ విషయానికొస్తే ఏకపక్షంగానే ఫలితాలు వెల్లడవుతున్నాయి.


ఇక్కడ అయితే డీఎంకే.. లేకుంటే అన్నాడీఎంకే నే అధికారం చేపడుతూ ఉంటాయి. జాతీయ పార్టీలకు ఇక్కడ స్థానం లేదు.  ఇక్కడ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు జరుగుతుంటాయి. ఈ రెండు ఎన్నికలకు కనీసం రెండేళ్లు వ్యవధి ఉంటోంది. దీంతో ఈ రెండేళ్లు ప్రభుత్వం అనుసరించిన విధానాలకు అనుగుణంగా ఓటర్లు తుది తీర్పు చెబుతారు. కాకపోతే అధికార పార్టీకి షాక్ ఇవ్వడం ఇక్కడి ప్రజల ఆనవాయితీగా వస్తోంది.


భారత ప్రధాని మోదీ మరోసారి బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందకు యత్నిస్తున్నారు. కేవలం గెలుపే కాదు.. భారీ మెజార్టీయే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరాధిలో బీజేపీ బలంగా ఉంది. దక్షిణాదిలో ఆ పార్టీ ప్రభావం అంతంత మాత్రమే. దీంతో ఈసారి ఇక్కడ పట్టు సాధించాలని ఉవ్విళూరుతున్నారు. తరచూ పర్యటనలు చేస్తూ ఇక్కడి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.


దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత బీజేపీ అంతగా ప్రాధాన్యం ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందంటే.. అది తమిళనాడు అని చెప్పవచ్చు. వాస్తవానికి అన్నాడీఎంకే రెండు వర్గాలుగా చీలిపోవడం బీజేపీకి కలసి వచ్చింది. అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టుకొని అన్నామలైని ఆ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించడంతో ఆ పార్టీ క్రేజ్ రెండింతలు పెరిగింది. ప్రస్తుతం అక్కడ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనే ఉద్దేశంతో మోదీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అధికార డీఎంకే పై కుటుంబ పార్టీ విమర్శలు చేస్తూ.. అవినీతి, అక్రమాల గురించి ప్రస్తావిస్తున్నారు. మరి నరేంద్రుడి ఫార్ములా విజయవంతం అవుతుందా.. తమిళనాడులో బీజేపీ పుంజుకుంటుందా అనేది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: