2018 డిసెంబరులో  తెలంగాలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో బీఆర్ఎస్ 88 సీట్లతో ఘన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికలకు వచ్చే సరికి తొమ్మిది సీట్లకు పరిమితం అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వారు ఎంపీలుగా గెలిచారు. ఇది ఒక విచిత్ర తీర్పు. కేవలం నాలుగు నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది అనలేం.


ఇప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బొటాబొటీ మెజార్టీతో విజయం సాధించింది. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని.. దాదాపు ఐదింటిని అమలు చేసింది. ప్రజల్లో సానుకూల వాతావరణం ఉంది. కానీ ఈసారి హస్తం పార్టీ లక్ష్యం పెట్టుకున్నట్లు 14 స్థానాల్లో గెలుస్తుందా అంటే చెప్పలేం. ఈ సందర్భంలో బీజేపీ బలపడగా.. బీఆర్ఎస్ డీలా పడింది. ఒక్క అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఆ పార్టీ ముఖ్య నాయకులు పార్టీలు మారగా.. మరికొందరు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.


ఇదిలా ఉండగా బీజేపీ రెండు లేదా మొదటి స్థానంలో ఉంటుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు.  దాదాపు ప్రధాన పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని పలు సర్వేలు స్పష్టం చేశాయి. లోక్ సభ  ఎన్నికలు జాతీయ పార్టీల ఎన్నికలు అని కేంద్రంలో అధికారంలో నిర్ణయించేవి కాబట్టి.. ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మధ్య ఉంటుందని ప్రచారం చేస్తున్నారు.


ఆది నుంచి బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితం అవుతుందనే ఒక మౌత్ టాక్ ను ప్రచారంలోకి తీసుకెళ్తున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ ఓడిపోతుంది అనే మౌత్ టాక్ ను ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతం అయ్యారు. ఇప్పుడు కూడా అదే జరగుతుంది. కాకపోతే ఎన్నికలకు నెల రోజుల సమయం ఉన్నందున ఏదైనా జరగవచ్చని.. మొత్తం మీద ఏకపక్ష తీర్పు ఉండదని పలువురు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr