నా అక్కచెల్లెమ్మలు అంటూ తరచూ ఏపీ సీఎం జగన్‌ ప్రసంగిస్తుంటారు. అలాగే నా బీసీలు, నా ఎస్సీ, నా ఎస్టీలు అంటూ తరచు రాజకీయ ప్రసంగాలు చేస్తుంటారు. అయితే జగన్ మాత్రం చాలా మంది నాయకుల్లాగే కేవలం హామీలు ఇచ్చి మరచిపోరు. వాటిలో చాలా వరకూ అమలు చేస్తారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆ పార్టీ నుంచి అసెంబ్లీ, పార్లమెంటు బరిలో దిగి మహిళా అభ్యర్థులు. జగన్‌ ఈసారి పెద్దసంఖ్యలో మహిళలకు అవకాశం కల్పించారు. అది కూడా బాగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు చెందిన ఎందరో మహిళలను చట్టసభల బరిలో నిలిపారు.


2019 ఎన్నికలతో పోలిస్తే మహిళలకు 4 ఎమ్మెల్యే స్థానాలకు ఎక్కువగా జగన్ సీట్లు కేటాయించారు. 2019 ఎన్నికల సమయంలో మహిళలకు 15 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చిన జగన్‌ ఈసారి ఆ సంఖ్య మరో నాలుగు పెంచారు. ఈసారి ఏకంగా 19 స్థానాలు మహిళలకు కేటాయించారు. అలాగే ఎంపీ స్థానాల్లోనూ గతంతో పోలిస్తే ఓ నియోజక వర్గం ఎక్కువే ఇచ్చారు. విడదల రజని వంటి ఎందరో వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు రాజకీయ అధికారం కల్పించిన జగన్ ఈసారి ఆ సంఖ్యను ఇంకాస్త పెంచి తాను మహిళాపక్షపాతినని నిరూపించుకున్నారు.


సోషల్ ఇంజినీరింగ్‌ను అమలు చేయడంలో జగన్‌ ఏపీలో అందరికంటే ముందున్నాడని చెప్పుకోవచ్చు. అంతే కాదు.. నారా లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌ వంటి ప్రముఖులపై కూడా మహిళా అభ్యర్థులనే పోటికి నిలిపారు. పవన్‌ కల్యాణ్‌పై వంగా గీతను పోటికి నిలిపారు. నారా లోకేశ్‌పై పోటీ చేస్తున్న మురుగుడు లావణ్య ఓ బీసీ మహిళ కావడం విశేషం. ఎస్టీల విషయానికి వస్తే పాలకొండలో విశ్వసరాయ కళావతి, రంపచోడవరంలో ధనలక్ష్మికు అవకాశమిచ్చారు. ఎస్సీ మహిళలు మేకతోటి సుచరిత, తానేటి వనితలకు ఏకంగా హోంమంత్రుగా అవకాశం కల్పించారు.


ఒక్క గుంటూరు  పార్లమెంటు పరిధిలోనే నలుగురు మహిళలకు జగన్ అవకాశం కల్పించారు. ఇక రాయలసీమలో కురబ వర్గానికి చెందిన ఉషాశ్రీ చరణ్‌కు మళ్లీ ఛాన్స్ ఇచ్చారు. కురుబ, నగరిలో రోజా, గంగాధర నెల్లూరు కృపాలక్ష్మి.. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్‌ సీట్లు ఇచ్చి అక్కచెల్లెమ్మల జాబితా చాలా పెద్దదే సుమా.

మరింత సమాచారం తెలుసుకోండి: