నేరుగా ప్రత్యర్థిపై పోరాటం చేయడం రొటీన్. చంద్రబాబు వ్యూహాలు ఇందుకు భిన్నంగా ఉంటాయి. ఆయన ప్రత్యర్థులపై ఎక్కువగా పరోక్ష యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో కొత్త కొత్త పాత్రలను తెరపైకి తెస్తారు. ఈ ఎన్నికల్లో ఆయన ఏకంగా జగన్‌పైకి సొంత చెల్లెళ్లనే ప్రయోగించినట్టు చెబుతున్నారు. వివేకా హత్య కేసుపై పోరాడుతున్న ఆయన కుమార్తె సునీతను, అన్న తనకు ఆస్తి సరిగ్గా పంచలేదన్న కోపంతో ఉన్న షర్మిలను చంద్రబాబు తెలివిగా జగన్‌పైకి ప్రయోగించారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే.. అక్కడితో చంద్రబాబు వ్యూహాలు ఆగలేదు. ఎన్నికలకు ముందు క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉన్నా.. అంతటా కూటమి గెలుస్తోందనే భావనే కనిపించాలి. అందుకు ఆయన తాజాగా రవిప్రకాష్ అస్త్రాన్ని ప్రయోగించినట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ కోర్టు కేసులు, ఇతర అంశాల కారణంగా తెరపై కనిపించని తొలి తరం టీవీ జర్నలిస్టు రవిప్రకాష్ కొన్నేళ్ల క్రితం Rtv అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ఛానల్ ప్రారంభించినా ఎప్పుడూ తెరపై కనిపించలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఎన్నికలకు పది రోజుల ముందు తెరపైకి వచ్చిన రవిప్రకాష్ ఈ ఎన్నికల్లో చంద్రబాబు గెలవబోతున్నాడని తేల్చి చెప్పారు.
ఇప్పుడు రవిప్రకాష్ తెరపైకి రావడం చంద్రబాబు వ్యూహంలో భాగమే అన్న చర్చ నడుస్తోంది. అంతే కాదు గత ఎన్నికల ముందు గరుడ పురాణం అంటూ ఏవేవో కథలు వినిపించిన నటుడు శివాజీ కూడా మళ్లీ తెరపై కనిపిస్తున్నారు. ఒక షర్మిల, ఒక రవిప్రకాష్, ఒక శివాజీ.. ఇంకా చంద్రబాబు ప్రవేశపెట్టే కొత్త పాత్రలు ఏమై ఉంటాయా అన్న టాక్ పొలిటికకల్ సర్కిల్‌లో బాగా వినిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి