ఏపీలో ముగిసిన అతి పెద్ద ఎన్నికల పోలింగ్ సమరంలో కూటమి పార్టీల ప్రధాన లక్ష్యం వైసీపీని ప్రభుత్వాన్ని గద్దె దించడం. అధికార వైసీపీని ఓడించడం. తద్వారా జగన్ ను ఇంటికి పంపించడం. ఈ ప్రాతిపదికనే టీడీపీ, జనసేనలు కలిసి ముందుకు సాగాయి. సీట్లు పంచుకున్నాయి. అయితే అనేక సమస్యలు వచ్చినా తట్టుకొని ముందుకు సాగారు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు వచ్చిన అతిపెద్ద డౌట్ ఓట్ల బదలాయింపు సక్రమంగా జరిగిందా?


ఈ సారి జనం ఏ బటన్ నొక్కారు. ఎవరి వైపు గాలి వీచింది. కూటమి పాసైందా. ఓట్ల బదలాయింపు సంపూర్ణంగా జరిగిందా? అంతా కూటమి అనుకున్నట్లే జరగిందా.. లేక ఎదురు దెబ్బ తగిలే అవకావం ఉందా? ఇది ఎక్కడ చూసినా అందరి చర్చలు దీని చుట్టూనే తిరుగుతున్నాయి. మరోవైపు కూటమి నేతల తర్జన భర్జన కూడా ఇదే.


ఓట్ల బదిలీ ముఖ్యం అంటూ జనసేన, టీడీపీ నాయకులు పదే పదే ప్రస్తావిస్తూ ఆయా పార్టీల అధినేతలు ప్రచారం సాగించారు. తాము పోటీ చేయని ప్రాంతాల్లో కూటమి పార్టీల ఓటు బ్యాంకు తమకు పడాలనేది సూత్రం. ఓటు మాత్రం వైసీపీకి పడకూడదు. ఇది ఆ పార్టీ నాయకులు క్షేత్ర స్థాయిలో పనిచేసిన తీరు. ఇక ఓటు బ్యాంకు పెద్దగా లేని బీజేపీకి దీనితో లాభమే కానీ నష్టం లేదు. ఎటొచ్చి టీడీపీ, జనసేనలకే తలనొప్పి అంతా.


ప్రస్తుతం పోలింగ్ కూడా ముగిసింది. ఇప్పుడు విశ్లేషణలు ఓట్ల బదలాయింపుపై జరుగుతున్నాయి. ఒకవేళ టీడీపీ, జనసేన అనుకున్నట్లు ఓట్లు ట్రాన్స్ఫర్ జరిగితే కూటమి కచ్ఛితంగా అధికారంలోకి వస్తుంది. 100శాతం జరిగే అవకాశం అయితే లేదు. కనీసం 80శాతం జరిగినా కూటమి విజయం సాధించినట్టే.  60-70 అయినా అధికారంపై ఆశలు పెట్టుకోవచ్చు. అంతకు మించి తగ్గితే మాత్రం వైసీపీకి మేలు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జనసేన అభ్యర్థులు లేని చోట బదలాయింపు సక్రమంగా జరిగినా.. జనసేన అభ్యర్థులకు టీడీపీ ఓటు బ్యాంకు టర్న్ అయిందా అనేదే ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న. మరి వీటన్నింటికి జూన్ 4 సమాధానం రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: