ఈసారి ఎన్నికలు ఎలా చూసుకున్నా జనసేనకు శుభ సూచికంగా కనిపిస్తున్నాయి. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న జనసైనికల కల తీరేలా కనిపిస్తోంది. దాదాపు పవన్ కల్యాణ్ గెలుస్తారు అని పలువురు విశ్లేషిస్తున్నారు. కేవలం ఆయన గెలుపే కాదు.. ఈ సారి మూడో అతి పెద్ద పార్టీగా జనసేన అవతరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు.


పదేళ్ల క్రితం పార్టీ పెట్టిన తర్వాత జనసేనకే ఈ సారి అసెంబ్లీలో అత్యధిక స్థానాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న జనసేన.. ఈ సారి డబుల్ డిజిట్ కు చేరుకుంటుంది అని దీంతో పాటు జనసేనాని కూడా అసెంబ్లీలో అడుగు పెడతారనే అంచనాలు వెలువడుతుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జనసేన ఏర్పడి పుష్కర కాలం అవుతున్నా ఇప్పటికి రెండు ఎన్నికల్లో మాత్రమే పోటీ చేసింది. 2014లో కూటమికి మద్దతివ్వడం.. ఆ తర్వాత రాంగ్ స్టెప్ వేసి వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్లడంతో రెండు చోట్ల ఓటమి పాలయ్యారు.


వెంటనే తప్పు నుంచి రియలైజ్ అయి బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఏపీలో కూటమి ఏర్పడటంతో పవన్ పాత్రే కీలకం అని మనందరకీ తెలిసిందే. ఒకవేళ ఇప్పుడు ఎన్డీయే కూటమి ఏపీలో అధికారంలోకి వస్తే నంబర్ 2 పదవి కచ్ఛితంగా దక్కుతుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన గౌరవం తగ్గకుండా చంద్రబాబు వ్యవహరించారు.


ఇక ప్రభుత్వంలో కూడా ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవేళ ఓడినా జనసేన అసెంబ్లీతో పాటు ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు తర్వాత అంతటి బలమైన ప్రతిపక్ష నేతగా పవన్ అవతరించనున్నారు. ఒకవేళ ఎన్డీయే కేంద్రంలో అధికారంలోకి వస్తే పవన్ కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు లేకపోలేదు. మొత్తం మీద ఎలా చూసుకున్నా.. పవన్ కు ఈ ఎన్నికలు మంచి బూస్ట్ ఇవ్వబోతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ఇవి జనసేనకు మంచి శుభపరిణామం.

మరింత సమాచారం తెలుసుకోండి: