ఏపీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికార.. విపక్షాలకు అత్యంత కీలకమైన ఎన్నికలకు సంబంధించి పోలింగ్ పూర్తి కావడం.. తదనంతర పరిణామాల గురించి తెలిసిందే. గెలుపు ధీమాపై అధికార, విపక్షాలు తమ వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. విపక్ష నేతలతో పోలిస్తే అధికార పక్ష అధినేత నోటి నుంచే గెలుపు మాట బలంగా వినిపించింది. అయితే అటు ప్రతిపక్ష నేత, ఇటు శాసన సభ పక్ష నేత ఇద్దరూ విదేశీ పర్యటనలో ఉండటం గమనార్హం.


ఇది ఇలా ఉంచితే.. పోలింగ్ ముగిసిన తర్వాత ఏపీలోని పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా వారిని కట్టడి చేయడంలో పోలీస్ అధికారులు ఫెయిల్ అయ్యారు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్రం ఎన్నికల సంఘం సైతం దీనిపై సీరియస్ అయింది. ఇందా ఓ వైపు.. కాగా పోలింగ్ విశ్లేషణలు మరోవైపు.


పోలింగ్ జరిగిన తీరు..  ఏపార్టీకి ఓట్లు పడి ఉంటాయనే దానిపై అధికార విపక్షాలు లెక్కలు వేసుకుంటున్నాయి. అయితే ఇంతలోనే అధికారుల తీరులో కొంత మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. అత్యంత కీలక స్థానాల్లో ఉన్న అదికారులు విపక్ష నేత చంద్రబాబుతో టచ్ లోకి వెళ్లేందుకు తహతహలాడుతున్నారని తెలుస్తోంది. ప్రజల నాడిని అంచనా వేసిన సదరు అధికారులు అధికారంలోకి టీడీపీ వచ్చిదనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం.


టీడీపీతో ప్రస్తుతానికి టచ్ లోకి వెళ్లిన అధికారుల్లో ఎక్కువ మంది గత ప్రభుత్వంలో పక్కన పెట్టినవారే. వీరితో పాటు ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నవారు ఉండటం గమనార్హం. తమపై టీడీపీ ముద్ర వేసి పక్కకు పెట్టారని.. తమ సంగతి చూడాలని ఈ సందర్భంగా విన్నవించారంట. ఆసక్తికర అంశం ఏమిటంటే.. ప్రభుత్వ విధానాలకు తాము కూడా అనుగుణంగా నడుచుకుంటామని జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు సైతం చంద్రబాబుతో చెబుతున్నారట. ఈ సందర్భంగా వారు టీడీపీకి, మీకు వ్యతిరేకం కాదని.. కేవలం ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లే నడుచుకున్నామని.. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారని తెలిసింది. కొందరు బీజేపీ అగ్రనేతల ద్వారా ఫోన్ చేయిస్తున్నారని.. ఫలితాలకు ముందే మచ్చిక చేసుకొని తర్వాత  మంచి పోస్టు కొట్టేయాలన్నది వారి ఉద్దేశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి వీరి అంచనాలు నిజం అవుతాయో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: