వైసీపీ అధినేత జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై పార్టీలో నాయకుల మధ్య చిత్ర విచిత్రమైన చర్చలు జరుగుతున్నాయి. అసలు పార్టీ అధినేతకు ఈ సలహాలు ఇస్తుంది ఎవరు ? జగన్ ను నడిపిస్తుందెవరు అని సీనియర్ నాయకులు సైతం చర్చించుకుంటున్నారు. వాస్తవానికి గత వారంలో రెండు కార్యక్రమాలకు జగన్ శ్రీకారం చుట్టారు. ఈ రెండు కార్యక్రమాలు పార్టీకి ప్లస్ కాకపోగా మైనస్ అయ్యాయి. పైగా పార్టీపై ఉన్న వ్యతిరేకత మరింత పెరిగేలా చేశాయి. ఈ వ్యవహారం ఇప్పుడు వైసీపీలో బిగ్ హాట్‌ టాపిక్ గా మారింది. అసలు జగన్కు ఈ సలహాలు ఇస్తోంది ఎవరు ? అని కూడా పార్టీ నాయకులు ఆరా తీస్తున్నారు. గత ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి సలహాలే పార్టీని కొంపముంచాయన్న భావన పార్టీ నాయకుల్లో ఉంది. నియోజకవర్గంలో మార్పుల నుంచి పార్టీ మారి పోయిన నాయ‌కుల‌ను కనీసం వారిని పిలిపించి మాట్లాడకపోవడం పార్టీ పరంగా వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేయకపోవడం పెద్ద మైన‌స్‌.


ఇక పార్టీ ఎమ్మెల్యేలను కీలక నేత‌ల‌ నియోజకవర్గాలకు ఇష్టం వచ్చినట్లు మార్పులు .. చేర్పులు చేయడం తప్పులు మీద తప్పులు ఎన్నో చేశారు. దీనివల్ల పార్టీ ఘోరంగా నష్టపోయింది. కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రధానంగా అసెంబ్లీకి వెళ్లబోమని భీష్మంచడం ఎమ్మెల్యేలకు జగన్ పట్ల తీవ్ర కోపానికి కారణం అవుతోంది. ఎవరు కూడా బయటకు చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది. రౌడీ షీట‌ర్ల కుటుంబాలను పరామర్శించే కార్యక్రమానికి సంబంధించి కూడా ఎవరికి చెప్పకుండానే నిర్ణయం తీసుకున్నారని నాయకులు చెవులు కోరుక్కుంటున్నారు. ఇది సరికాదని ... మనం వరద ప్రభావిత ప్రాంతమైన విజయవాడలో కూడా బాధితులను ఇప్పటివరకు పరామర్శించలేదని కొందరు గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా జగన్ చేస్తున్న పనులు వల్ల పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. జగన్ ఇప్పటికైనా తన తీరు మార్చుకోకపోతే పార్టీ మరింత ఘోరంగా నష్టపోవడం ఖాయమని పార్టీ నేతలు లబోదిబోమంటున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: