అమరావతి రాజధాని ప్రాంతంలో పలు ప్రముఖ సంస్థలకు భూమి కేటాయించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 11 సంస్థలకు మొత్తం 49.50 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బాసిల్ ఉడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు 4 ఎకరాలు, సెయింట్ మోరీస్ స్కూల్‌కు 7.97 ఎకరాలు, సీఐఐ గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్‌కు 15 ఎకరాలు లీజు ప్రాతిపదికన కేటాయించారు. అలాగే, కంట్రోలర్ ఆడిటర్ జనరల్‌కు 5 ఎకరాలు, జ్యూడీషియల్ అకాడమీకి 4.83 ఎకరాలు, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌కు 5 ఎకరాలు కేటాయించారు.

ఈ కేటాయింపులు మంత్రుల బృందం సిఫార్సుల ఆధారంగా జరిగాయి.పలు బ్యాంకులైన ఐఓబీ, పీఎన్‌బీ, ఐడీబీఐలకు 0.40 సెంట్ల చొప్పున స్థలం కేటాయించారు. ఎన్టీపీసీకి 1.50 ఎకరాలు, కేంద్ర ప్రభుత్వ ప్లానిటోరియంకు 5 ఎకరాలు కేటాయించారు. ఈ భూములను కార్యాలయాలు, భవనాల నిర్మాణం కోసం రాయితీ ధరలతో, లీజు ప్రాతిపదికన అందించారు. సీఆర్‌డీఏ కమిషనర్‌ను తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. గతంలో కేటాయించిన భూముల్లో కొన్ని సంస్థలకు మార్పులు చేశారు. ఆరు సంస్థలకు 67.4 ఎకరాల నుంచి 42.30 ఎకరాలకు భూమిని కుదించారు.

ఎనిమిది సంస్థల రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లకు 32.65 ఎకరాల నుంచి 12.66 ఎకరాలకు తగ్గించారు. మరోవైపు, ఆరు సంస్థలకు 13.1 ఎకరాల నుంచి 16.19 ఎకరాలకు భూమిని పెంచారు. ఈ మార్పులు సంస్థల ప్రతిపాదనల ఆధారంగా జరిగాయి.ఈ భూమి కేటాయింపులు అమరావతిని అభివృద్ధి కేంద్రంగా మార్చే లక్ష్యంతో చేపట్టారు. విద్య, న్యాయం, ఆర్థిక, నిర్మాణ రంగాల్లో ప్రముఖ సంస్థల స్థాపనతో రాజధాని ప్రాంతం ఆకర్షణీయంగా తీర్చిదిద్దబడుతుంది. ఈ చర్యలు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి, ఉపాధి అవకాశాల సృష్టికి దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: