హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌.. ఈసీఐఎల్‌ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఈ ఉద్యోగాలు ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 28 వరకూ ఉద్యోగాలు ఉన్నాయి.

టెక్నికల్‌ ఆఫీసర్‌ అనే విభాగంలో మొత్తం ఖాళీలు 28 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అర్హత సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే.. వయసు: 31.10.2019 నాటికి 30 ఏళ్లు మించకూడదన్న నిబంధన ఉంది.

 

ఈ ఉద్యోగాలకు రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఇలా అప్లయ్ చేయడానికి చివరితేది: నవంబరు 30. మరిన్ని వివరాలు కోసం http://www.ecil.co.in/ ను చూడవచ్చు.

 

ఈసీఐఎల్ చాలా ప్రతిష్టాత్మక సంస్థ.. ఈ సంస్థలో ఉద్యోగం అంటే చాలా గౌరవంతో కూడిన అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ అనుభవం అభ్యర్థులకు ముందు ముందు కేరీర్ లో చాలా విలువైందిగా పరిగణిస్తారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: