నాఫెడ్.. అంటే.. నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలిమిటెడ్. ఇది ఢిల్లీలో ఉంది. ఈ సంస్థ అనేక పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు 43 పోస్టులు ఉన్నాయి. అవి ఏ ఏ పోస్టులంటే.. మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, తదితర పోస్టులు.
ఈ పోస్టులకు పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఎంబీఏ ఉత్తీర్ణత అర్హతలుగా నిర్ణయిచారు. అర్హతలతో పాటు అనుభవం కూడా ఉండాలి.
రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. చివరి తేదీ.. ఫిబ్రవరి 3, 2020. మరిన్ని వివరాల కోసం http://www.nafed-india.com/ అనే వెబ్ సైట్ ను చూడవచ్చు.
ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు. పడకపోవచ్చు. కానీ దీన్ని మీ వాట్సప్ గ్రూపుల్లోనూ, ఫేస్ బుక్ లోనూ పోస్టు చేయండి. అవసరమైన వారికి ఇది ఉపయోగపడుతుంది. మనం అనవసరంగా ఎన్నో పోస్టులు ఫార్వార్డ్ చేస్తుంటాం. ఇలా పనికొచ్చి ఉద్యోగ సమాచారం పంపితే ఎవరికైనా ఉపయోగపడొచ్చు.