నేటి సమాజంలో ఉన్నత చదువులు అభ్యసించి కూడా ఉద్యోగం దొరకక ఎందరో యువత అనేక ఇబ్బందు పడుతున్నారు. మంచి ఉద్యోగం వస్తుందని.. బంగారు భవిష్యత్తు కోసం ఉన్నదంతా చదువులకే ఖర్చు పెడుతున్నారు. కాని, ఆ తర్వాత ఉద్యోగం రాక ఆర్థిక ఇబ్బందులతో రోడ్డున పడుతున్నారు. నేటి బాలుడివి నీవు. రేపటి ప్రగతికి పునాదివి. రాబోయే తరానికి ప్రతినిధివి. తరచి చూడు నీ భవితను. తెరచి చూడు నీ చరిత్రను. ఇవన్నీ ఒక్కప్పటి మాటలు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. నేటి కాలంలో డిగ్రీ పట్టా చేతిలో ఉన్న ఉద్యోగం దొరకని పరిస్థితి.
అయితే టెన్త్, ఇంటర్ పాసైనవారికి ఓ అద్భుతమైన అవకాశం వచ్చింది. ఇండియన్ నేవీ ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్ పాస్ అయితే దరఖాస్తు చేయొచ్చు. సీనియర్ సెకండరీ రిక్రూట్-SSR, మెట్రిక్ రిక్రూట్-MR, ఆర్టిఫిషర్ అప్రెంటీసెస్-AA పోస్టులు భర్తీ చేయనుంది. పూర్తి వివరాలను https://www.joinindiannavy.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు ఇదే వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి.
ఇక డిసెంబర్-జనవరి, జూన్-జూలై నెలల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. అలాగే రాతపరీక్ష, ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. మరియు ఎస్ఎస్ఆర్ పోస్టుకు మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ / బయాలజీ / కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో 12వ తరగతి 60 శాతం మార్కులతో పాస్ కావాలి. ఎంఆర్ పోస్టుకు 10వ తరగతి పాస్ కావాలి.