కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగాల నియమాకాల జోరు కూడా బాగా పెరిగింది. ముఖ్యంగా ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు పెరిగాయి. కేసులు పెరుగుతున్న క్రమంలో వైద్య వృత్తికి సంబంధించిన సిబ్బందిని కూడా ఎక్కువగా నియమిస్తున్నారు. తాజాగా మరోసారి ఈ ఉద్యోగాల పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే ఎన్నో వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. పరిస్థితులు అదుపులో ఉండాలంటే వైద్య సిబ్బంది అవసరం ఎంతైనా ఉందని భావించి వరుస నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్నారు.

ఈ శాఖ ఆధ్వర్యం లో పనిచేస్తోన్న స్వతంత్ర సంస్థ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ , దీనికి సంబంధించిన ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన వాళ్ళు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. జులై 15 నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని  నోటిఫికేషన్ లో  పేర్కొన్నారు. natboard.edu.in పోర్టల్ ద్వారా దరఖాస్తు  చేసుకోవాలి. అప్లికేషన్ దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 14.

 ఈ ఉద్యోగాల కు సంబందించిన పూర్తి సమాచారం ఇదే..

మొత్తం ఖాళీలు -42

జూనియర్ అసిస్టెంట్-30,

సీనియర్ అసిస్టెంట్- 08,

జూనియర్ అకౌంటెంట్ పోస్టులు- 4

అర్హతలు :

గుర్తింపు పొందిన విద్యాలయాల లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఒక్కో పోస్టులకు ఒక్కో విద్యార్హతలు ఉన్నాయని గమనించుకోవాలి..

అభ్యర్థులు www.natboard.edu.in వెబ్‌ సైట్‌లో, జులై 15 నుంచి దరఖాస్తు చేసుకోవాలి. అందుబాటు లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే ఆన్ లైన్ లో అప్లికేషన్ సమర్పించాలి.. ఆగస్టు 14 సాయంత్రం 5 గంటల లోపు అప్లై చేసుకోవాలి.. ఆసక్తి కలిగిన నిరుద్యోగులు, విద్యార్థులు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలని మనవి..


మరింత సమాచారం తెలుసుకోండి: