బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.. సంవత్సరం క్రితం వరుకు 31 వెయ్యి ఉన్న బంగారం ధర ఇప్పుడు ఏకంగా 46 వేలు దాటింది.. కేవలం అంటే కేవలం ఒక సంవత్సరంలో ఏకంగా 15 వేలు పెరిగింది. ఇలా పెరగడానికి కారణం అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ ఎక్కువ అవుతే.. మరో వైపు కరోనా వైరస్ కారణం అయ్యింది. 

 

కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్ దారుణంగా నాశనం అవ్వడంతో ఇన్వెస్టర్లు అంత కూడా బంగారంపైనే ఇన్వెస్ట్ చేశారు. దీంతో బంగారం ధరలు అతి దారుణంగా పెరిగిపోయాయి.. ఈ లాక్ డౌన్ కారణంగా ఏకంగా ఐదు వేలకుపైగా బంగారం ధరలు పెరిగాయ్ అంటే నమ్మండి. అలాంటి ఈ బంగారం ధరలు ఇప్పుడు తగ్గాయి.. ఎంత తగ్గాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

నేడు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యరెట్ల బంగారం ధర 240 రూపాయిల తగ్గుదలతో  49,050 రూపాయలకు చేరింది. ఇంకా అలానే నేడు 22 క్యారెట్ల బంగారం ధరపై 190 రూపాయిల తగ్గుదలతో 45,240 రూపాయలకు చేరింది. ఇంకా వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. దీంతో వెండి కూడా భారీగా తగ్గింది. 

 

నేడు కేజీ వెండి ధర 800 రూపాయిలు తగ్గుదలతో 48,200 రూపాయలకు చేరింది. అయితే లాక్ డౌన్ సమయంలో కేజీ వెండి ధర 40 వేల రూపాయిల వద్ద కొనసాగింది. ఇలా నేడు బంగారం ధరలు కొనసాగుతున్నాయి. విశాఖపట్నం, అమరావతిలో కూడా బంగారం ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. ఢిల్లీ, ముంబై మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.                       

మరింత సమాచారం తెలుసుకోండి: