మొన్నటి వరకు భారతీయ మార్కెట్ లో బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి.. దాంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య  భారీగా పెరిగింది. ఇంకా తగ్గుతాయి అనుకొనే లోపు మళ్లీ మార్కెట్ లో రేట్లు పుంజుకుంటున్నాయి. గత మూడు రోజుల క్రితం వరకు బంగారం ధరలు వెల వెల బోయాయి..నిన్న ఈరోజు రేట్లు ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాయి. నిన్న కాస్త పైకి కదిలిన రేట్లు ఈ రోజు ఇంకాస్త పెరిగాయి..కొనుగోలు పెరగడం వల్ల ధరలు పెరిగాయని తెలుస్తుంది..మార్కెట్ రేటు షాక్ కు గురిచేస్తుంది. 



అంతర్జాతీయ మార్కెట్ లో పరుగులు పెట్టిన బంగారం ధరలకు ఈ మధ్య బ్రేకులు పడ్డాయి..ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో రేట్లు ఆందోళనకరంగా మారాయి.నిన్న 24 క్యారెట్ల బంగారం రూ.50,070 ఉండగా,22 క్యారెట్ల ధర రూ.45,900కు పెరిగింది.. ఈరోజు మాత్రం ఇంకాస్త పెరిగింది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పైకి కదిలింది. రూ.50,290 చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.200 పెరుగుదలతో రూ.46,100కు పెరిగింది. 



బంగారం ధరల పైనే వెండి ధరలు కూడా ఆధారపడుతున్నాయి..వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.200 పెరిగింది. దీంతో వెండి ధర రూ.67,500కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ భారీగా పెరగడంతో ఇప్పుడు మార్కెట్ లో వెండి పరుగులు పెడుతుంది. అంతర్జాతీయ మార్కెట్ లో వీటి ధర విషయానికొస్తే.. బంగారం ధర ఔన్స్‌కు 0.05 శాతం పెరుగుదలతో 1842 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.74 శాతం పెరుగుదలతో 24.31 డాలర్లకు పెరిగింది. ఇక ఇలానే ఉంటే మున్ముందు బంగారం, వెండి వస్తువులు కనుమరుగు అవుతాయని కొనుగోలు దారులు వాపోతున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: