పసిడి ప్రియులకు చేదు వార్త.. పసిడి కొనుగోలు చేయడానికి చాలా మంది ఆలోచిస్తున్నారు.. కానీ ఈరోజు మాత్రం వారికి పసిడి రేటు ఈరోజు కూడా పరుగులు పెట్టింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం ధర పెరగడం ఇది వరుసగా మూడో రోజు కావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరగడం వల్ల దేశీ మార్కెట్‌లో కూడా పసిడి రేటు పరుగులు పెట్టిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇది నిజంగానే చేదు వార్త అనే చెప్పాలి.


ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.630 పరుగులు పెట్టింది. రూ.49,180కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.110 పెరుగుదలతో రూ.44,610కు ఎగసింది..అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.05 శాతం పరుగులు పెట్టింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1832 డాలర్లకు చేరింది. బలహీనమైన డాలర్ కారణంగా బంగారం ధరలు పైకి కదిలాయి..


బంగారం ధరలు పైకి కదిలితే.. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం వెండి ధర స్థిరంగానే కొనసాగింది. ధరలో మార్పు లేదు. దీంతో కేజీ వెండి ధర రూ.76,100 వద్దనే కొనసాగుతోంది. అంటే తులం వెండి ధర దాదాపు రూ.760 వద్ద ఉందని చెప్పుకోవచ్చు. వెండి ధర దూసుకెళ్లింది. వెండి ధర ఔన్స్‌కు 0.71 శాతం పెరుగుదలతో 27.67 డాలర్లకు ఎగసింది. గ్లోబల్ మార్కెట్‌లో వెండి ధరలు పెరిగినా కూడా దేశీ మార్కెట్‌లో వెండి రేటు నిలకడగా ఉండటం గమనార్హం.అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.05 శాతం పరుగులు పెట్టింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1832 డాలర్లకు చేరింది. మరి రేపటి రోజున మార్కెట్ లో ఈ ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: