డిసెంబర్ 21న వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చాలామంది రాజకీయ నాయకులతో పాటు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా జగన్ సోదరి అయిన షర్మిల కూడా తన అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీంతో అలా తెలపడంతో ఈ ఏడాది ఇది చిన్నపాటి ట్విస్ట్ అని చెప్పవచ్చు. అయితే ఈ ట్విట్ చెల్లెలుగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షరాలుగా షర్మిల వైసిపి అధ్యక్షుడు జగన్ గారికి అంటూ శుభాకాంక్షలు తెలియజేసింది. ఇందుకు జగన్ కూడా స్పందిస్తూ.. థాంక్యూ షర్మిలమ్మ అంటూ రిప్లై ఇచ్చారు. వీరిద్దరికి సంబంధించిన ట్విట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాబోయే రోజుల్లో కచ్చితంగా జగన్, షర్మిల (అన్నా చెల్లెలు) ఇద్దరు కూడా కలిసిపోయే అవకాశం ఉందని ఇప్పటికే చాలామంది నాయకులు కూడా తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. వీటిని చూస్తూ ఉంటే అవన్నీ నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ విషయం వైయస్ అభిమానులకు కాస్త ఊరట కలిగించేలా ఉందని చెప్పవచ్చు. వైయస్ కుటుంబంలో ఈ కలహాలను తీర్చిన వేళ ఈ ఏడాది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి